Take a fresh look at your lifestyle.

చట్టాలను ఉపయోగించడంలో పోలీసుల వివక్ష

- పోలీసు అధికారులకు ఆ చట్టం వర్తించదా..? - 1200 మంది బాధితుల స్టేట్మెంట్ ఏది..?

0 1,416

చట్టాలను ఉపయోగించడంలో పోలీసుల వివక్ష
– పోలీసు అధికారులకు ఆ చట్టం వర్తించదా..?
– 1200 మంది బాధితుల స్టేట్‭మెంట్ ఏది..?
– పీడి యాక్ట్ పెట్టకపోతే సాక్ష్యాలు గల్లంతే..

ఫోన్ ట్యాపింగ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృంష్టించింది. కేసీఆర్ ప్రభుత్వంలో రాజకీయ లాభం కోసం పోలీసు అధికారులే చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పన్నెండు వందల మంది ఫోన్ లను ట్యాపింగ్ చేసి వారి ప్రైవేట్ సంభాషణ విన్నారు.

ఆ ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో జడ్జీలు, ప్రతిపక్ష, అధికార ప్రజాప్రతినిధులు, బిజినెస్‭మెన్‭లు ఉండటం విశేషం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాశారు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడమే కాకుండా సమాజానికి ప్రమాదకరంగా మారారు ఆ పోలీసు అధికారులు. ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

తెరపైకి పీడీ యాక్ట్

ప్రమాదకరమైన క్రిమినల్స్ మీద ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించి వాళ్లను జైల్లో ఉంచుతుంది. అయితే.. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన మాజీ పోలీసు అధికారులు సాక్ష్యాలు లేకుండా ప్రభుత్వ ప్రాపర్టీని ధ్వంసం చేశారు. చట్టంపై వాళ్లకు పూర్తిగా అవగహన ఉండడమే కాకుండా చట్టంలోని లొసుగులు తెలిసిన అలాంటి వ్యక్తులకు బెయిల్ ఇస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకునే మార్గం ఉందంటున్నారు న్యాయనిపుణులు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా నల్గొండ జిల్లాకు డాక్టర్ చెరుకు సుధాకర్ పై పీడీ యాక్ట్ పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షాలు లేకుండా చేసి ప్రభుత్వ ప్రాపర్టీని ధ్వంసం చేసిన నిందితులపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

చార్జిషీట్ తిరష్కరణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు అధికారులు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను అరెస్టు చేసి రిమాండ్ చేశారు. అయితే.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లి పోయారు. ఆయనను రప్పించడానికి రెడ్ కార్నర్ జారీ చేశారు. అయితే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేస్తున్న సిట్ అధికారులు కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు. ఆ చార్జిషీట్ ప్రాపర్ గా లేదని న్యాయమూర్తి తిరష్కరించారు.

12 వందల మంది బాధితుల స్టేట్ మెంట్..

ఫోన్ ట్యాపింగ్ కేసులో 12 వందల మంది బాధితులున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసు ఇంకా పటిష్టంగా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్ మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో స్టేట్ మెంట్ రికార్డు చేయాల్సిన అవసరం ఉంది. బాధితుల స్టేట్ మెంట్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ నిందితులకు శిక్షలు పడే అవకాశం ఉందంటున్నారు న్యాయనిపుణులు.

బెయిల్ మీద బయటకు వస్తే..

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు బెయిల్ మీద బయటకు వస్తే ఆ కేసులో సాక్ష్యాలు తారుమారు అవుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ కేసులో నిందితులంతా పోలీసు అధికారులు కావడంతో చట్టం గురించి పూర్తిగా అవగహన ఉంది. అయితే.. ఈ కేసులో సాంకేతికంగా సాక్షాలు లభించవద్దని ధ్వంసం చేసినందున వారికి బెయిల్ ఇవ్వకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking