నిర్దేశం: పవన్ కల్యాణ్, అల్లూ అర్జున్ మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఏనాడు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ స్పందించలేదు. కానీ, అల్లు అర్జున్ చాలా సార్లు బహిరంగం అయ్యారు. ఒక సినిమా ఫంక్షన్లో అయితే ‘చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్. తాజాగా జరిగిన ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల టైంలో వైసీపీ అభ్యర్థికి బన్నీ బహిరంగంగా ప్రచారం చేయడం చర్చనీయాంశం అయింది. దీనిపై నాగబాబు కామెంట్ చేసి చివరికి చేతులు కాల్చుకున్నారు కూడా.
ఇదంతా పక్కన పెడితే.. అల్లు అర్జున్ ని ఎప్పుడూ ఏమీ అనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్.. తాజాగా టార్గెటే చేసినట్లు కనిపిస్తోంది. అడవిని నరికే స్మగ్లర్ అనే పదాలు పవన్ కల్యాణ్ వాడారు. నిజానికి అల్లు అర్జున్ పేరును పవన్ కల్యాణ్ ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ, ఆయన చేసిన కామెంట్స్ బన్నీని ఉద్దేశించేనని నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
పవన్ ఏమన్నారు?
ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో ఉన్న సినిమా హీరోల గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడేవాడని, అయితే ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని, ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితని అన్నారు. పవన్ వద్ద అటవీ మంత్రిత్వ శాఖ ఉంది.
అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప సినిమా తెలిసిందే. ఆల్ ఇండియాలో బ్లాక్ బాస్టర్ సాధించిన ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ ఒక కలప స్మగ్లర్. ఈ సినిమాకు పార్ట్-2 కూడా వస్తోంది. ఇందులో ఇంకా పెద్ద స్మగ్లర్. ఈ సినిమాను ఉద్దేశించే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. చాలా కాలంగా జరుగుతున్న పరిణామాలను పవన్ తన మనసులోనే పెట్టుకున్నారని, సమయం చూసి వాటికి సమాధానం చెప్తారని ఆయన అభిమానులు అంటున్నారు. బహుశా.. ప్రభుత్వంలో పార్టీలో ఉన్న పెద్దలు బన్నీని ఉద్దేశించి కాదని అంటే అనొచ్చు కానీ, పవన్ నేరుగానే చెప్పారు. అందులో అనుమానాలు తావు లేదు.