రీల్స్ కోసం చిన్నారితో చెలగాటం

– రీల్స్ కోసం పిచ్చి మారిపోతున్న జనాలు
– వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజెన్లు

నిర్దేశం, హైదరాబాద్: పిచ్చి ముదిరితే తలకు రోకలి చుట్టుకున్నారట అనేది పాత మాట. రీల్స్ చుట్టే క్రమంలో ఇప్పుడు జనాలకు పిచ్చి ముదిరిపోతోంది. అదేనండి.. రీల్స్ కోసం జనాలు పిచ్చిగా మారిపోతున్నారు. నెటిజెన్లు చేసే ఫీట్స్ చూస్తుంటే నాలుగు లైకుల కోసం మరీ ఇంతకు దిగజారుతారా అనిపిస్తుంటుంది. తాజాగా ఓ యువతి వీడియో చూస్తే కోపం నుంచి అసహ్యం కూడా వస్తుంది.

సదరు యువతి నెలల వయసున్న ఓ బాలుడితో రీల్ చేసింది. ఓ చేత్తో బాలుడిని ఎత్తుకుని మరో చేత్తో సిగరెట్ తాగుతూ చేసిన ఆ రీల్ చూసి జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో సిగరెట్ పొగకు చిన్నారి ఉక్కిరి బిక్కిరి అవ్వడం చూడొచ్చు. చిన్నారి దగ్గుతున్నా యువతి మాత్రం తన మానాన తాను సిగరెట్ తాగుతూ వీడియోకు పోజులివ్వడం గమనార్హం.

ఈ దారుణాన్ని చూసిన జనాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సోషల్ మీడియా మోజులో పడి యువతి పెడదారి పడుతుందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారికి ముందు పొగతాగాలన్న ఆ ఆలోచన యువతికి ఎలా వచ్చిందో అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పసిపిల్లలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ బిడ్డ తల్లి ఏం చేస్తోందని కొందరు ప్రశ్నిస్తే.. ఆ యువతే చిన్నారి తల్లి అయితే యువతరం సోషల్ మీడియాకు బలైపోయినట్టుగా భావించాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!