Amala Paul: వామ్మో మరి ఇంత బోల్డుగా అమలా పాల్ని చూసి ఉండరు..!

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని హీరోయిన్ అమలా పాల్, మొన్ననే అక్టోబర్ 26న తన 33వ బర్త్ డేను కొడుకు, భర్తతో ఇండోనేసియాలోని బాలి లో సెలెబ్రేట్ చేసుకుంది.
బాలిలోని సముద్ర తీరాన బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి.

ఇక అమలా పాల్ గురించి చెప్పాలంటే కేరళకు చెందిన ప్రసిద్ధ నటి. తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో నటించి మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంది. అమలా పాల్ గత సంవత్సరం నవంబర్ 5న బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్‍ను కొచ్చిలో క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండోవ పెళ్లి చేసుకున్నారు. 2014లో డైరెక్టర్ ఏ.ఎల్.విజయ్‍ను అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ వీరి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాల వలన 2017లో విడాకులు తీసుకున్నారు.

అమలా పాల్ ఈ సంవత్సరం జూన్ 11న పండంటి బిడ్డకు జన్మనించారు, ఆమె కొడుకు పేరు ఇలాయ్. ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఆమెకి ఒక రకంగా చెప్పాలంటే స్పెషల్ ఎందుకంటే కొడుకు, భర్తతో కలిసి మొదటి పుట్టినరోజు జరుపుకుంది కాబట్టి, ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!