ముదిరాజ్ ల సంక్షేమం కోసం కృషి చేస్తా..
ఆపదలో ఉన్నోళ్లు అర్ధరాత్రి ఫోన్ చేయచ్చు..
– తెలంగాణ ముదిరాజ్ కార్పోరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్
నిర్దేశం, హైదరాబాద్ :
ముదిరాజ్ బిడ్డలకు సేవ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు తెలంగాణ ముదిరాజ్ కార్పోరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ముదిరాజ్ ల జీవితాలు చాలా ఆధ్వణంగా ఉన్నయన్నారు ఆయన. తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలకంఠం అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ కార్పోరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ లతో పాటు ఉత్తమ జర్నలిస్టులను శాలువలతో సన్మానించారు. అంతుకు ముందు పెద్దమ్మ ఫోటోకు పూల దండ వేసారు. ఈ సందర్భంగా మువదిరాజ్ లను బిసి డి నుంచి బిసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తేది నుంచి ‘‘ముదిరాజ్ ఆత్మగౌరవ పాదయాత్ర’’ నిర్వహించే పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొర్రా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తాను ప్రధాన్యత ఇస్తానన్నారు. ఐక్యత లేక పోవడం వల్లే ముదిరాజ్ లకు అన్యాయం జరుగుతుందన్నారు. ముదిరాజ్ బిడ్డల సంక్షేమం కోసం కాసాని జ్ఞానేశ్వర్, బండి ప్రకాష్, ఈటెల రాజేందర్ లను రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి ఒక్కతాటిపైకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ముదిరాజ్ ల కోసం కెటాయించిన ఐదు ఎకరాల స్థలంలో నూతన సంఘ భవన నిర్మాణంకు గత ప్రభుత్వం నిధులు కెటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో తాను, ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ లతో కలిసి ఆ భవన నిర్మాణం పూర్తి చేస్తామని జ్ఞానేశ్వర్ హామి ఇచ్చారు.
తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం వ్యవస్థాపకులు బల్ రాం మాట్లాడుతూ రాబోయే కాలంలో జర్నలిస్టుల భవిష్యత్ అందోళనకరంగా ఉండనున్నదన్నారు. సోషల్ మీడియా డామినేట్ చేస్తున్న నేటి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పిడిఎఫ్ పేపర్ లను, యూట్యూబ్ లను నిషేదించే అవకాశం ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కారించడానికే తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం ఉందన్నారు ఆయన. సినీ హీరోయిన్ విజయశాంతి ముదిరాజ్ కులం పేరుతో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నయని కొందరు జర్నలిస్టుల ప్రశ్నలకు బల్ రాం వివరణ ఇచ్చారు. విజయశాంతికి ముదిరాజ్ కులంతో సంబందం లేనందున ముందుగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు యాటకర్ల మల్లేష్, పరమేశ్వర్, గంగాధర్, నీల కంఠం, శ్రీనివాస్, డాక్టర్ వినోద్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.