Take a fresh look at your lifestyle.

గూగుల్ సరికొత్త ఫీచర్.. చదవడం కాదు, ఇక ఏదైనా వినడమే

మీరు Chrome బ్రౌజర్‌లో ఏదైనా వెబ్ పేజీని తెరిచి, ఆప్షన్‌కు వెళ్లి “Listen to Page” ఎంచుకోండి. దీంతో మీరు వచనాన్ని చదవడంతో పాటు వింటారు కూడా

0 61

– బిజీ ప్రపంచంలో సమాచారం సులభతరం చేసేందుకు
– ఆఫ్ లైన్ లో కూడా వినే సదుపాయం
– 20 భాషల్లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్

నిర్దేశం, హైదరాబాద్: ప్రపంచంలో కోట్లాది మంది చదవడాన్ని ఇష్టపడేవారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు, నవలలు చదవడం గురించి తెలిసిందే. అయితే మారుతున్న బిజీ లైఫ్ కారణంగా ఇప్పుడు చదవడానికి సమయం సరిపోవడం లేదు. దానికి బదులుగా వినడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గూగుల్ సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. దీని సహాయంతో ఇప్పుడు వచనాలను చదవడమే కాదు, వినగలుగుతారు కూడా. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం “Listen to Page”(ఈ పేజీని వినండి) అనే కొత్త ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఫీచర్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ గాడ్జెట్‌ని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఉపయోగించవచ్చు. మీరు Chrome బ్రౌజర్‌లో ఏదైనా వెబ్ పేజీని తెరిచి, ఆప్షన్‌కు వెళ్లి “Listen to Page” ఎంచుకోండి. దీంతో మీరు వచనాన్ని చదవడంతో పాటు వింటారు కూడా. అంతే కాదండోయ్.. దీనికి ఫార్వార్డ్, బ్యాక్ అనే ఆప్షన్లు కూడా ఇచ్చారు.

“Listen to Page” ఫీచర్ ఎలా పని చేస్తుంది?
గూగుల్ ప్రస్తుతం 12 భాషల్లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అరబిక్, బెంగాలీ, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, జపనీస్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ వంటి భాషల్లో అందుబాటులో ఉంచారు. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి, ముందుగా మీరు Google Chromeని తెరవాలి. ఆ తర్వాత మీరు వినాలనుకుంటున్న వెబ్‌పేజీకి వెళ్లండి. పైన ఉండే భాగంలో ఉన్న More బటన్‌పై క్లిక్ చేయండి. ‘Listen to Page’ ను నొక్కండి.

Leave A Reply

Your email address will not be published.

Breaking