ఇక నుంచి అడుక్కునే వారికి డ‌బ్బులిస్తే జైలుకే

నిర్దేశం, ఇండోర్ః అడుక్కునే వారి ప‌ట్ల చాలా ద‌య‌గా చూస్తుంటాం. అడుక్కునే వారికి ఎవ‌రైనా దూరం కొట్టిన‌ట్లు చూస్తే కోపం వ‌స్తుంది. వారికి ఇచ్చేది చిల్ల‌రేగా.. ఆమాత్రం సొమ్మేం పోతుంద‌ని అంటుంటాం. అయితే, అలా చేస్తే జైలుకు పంపిస్తామంటోంది ప్ర‌భుత్వం. ఈమాట విన‌గానే మీకు దిమ్మ‌తిరిగి పోయుంటుంది. ఇది నిజంగా నిజమేనండీ బాబోయ్. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో భిక్షాటనను నిషేధించారు. యాచకులకు సాయం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ఇండోర్‌ నగరం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే భిక్షాటనను నిషేధించిన జిల్లా అధికారులు.. యాచకులకు సాయం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భిక్షాటన చేసేవారికి డబ్బులిచ్చేవారిపైనా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని ప్రకటించారు. జనవరి 1, 2025 నుంచి ఈ నిబంధనలు అమలు చేస్తామని చెప్పారు. ‘‘నగరాన్ని యాచకులులేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం.

ఇందులో భాగంగా డిసెంబర్‌ చివరి వరకు వీటిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తాం. జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నట్లు కనిపిస్తే వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తాం’’ అని ఇందౌర్‌ కలెక్టర్‌ ఆశిశ్‌ సింగ్‌ హెచ్చరించారు. భిక్షాటన చేస్తున్న వారికి ఎటువంటి సాయం చేయొద్దని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. జాకిర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ కథ ఇదే.. యాచకులు లేని నగరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ.. 10 నగరాల్లో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టింది.

దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ సహా పలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో భాగంగా భిక్షాటన కార్యకలాపాలపై దృష్టి సారించిన ఇందౌర్‌ అధికారులు ఆశ్చర్యకరమైన విషయాలు గుర్తించారు. కొందరికి పక్కా ఇళ్లు ఉన్నాయని, మరికొందరి పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన కొన్ని ముఠాలు అనేక మందిని యాచక వృత్తిలో దించుతున్నట్లు తెలిసిందని ప్రాజెక్టు ఆఫీసర్‌ దినేశ్‌ మిశ్రా పేర్కొన్నారు.

ఇటువంటి అసాంఘీక చర్యలకు తావులేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని.. భిక్షాటన చేసే వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. ఇదిలాఉంటే, దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో ఇందౌర్‌ కొంతకాలంగా అగ్రస్థానంలో నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను వరుసగా కైవసం చేసుకుంటోంది. పరిశుభ్రతలోనే కాకుండా యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!