మలేషియాలో మనోళ్ల సంక్రాంతి
- డ్యాన్స్ లతో ధూం.. ధాం.. చేసిన చిన్నారులు..
- భారత స్త్రీలా వస్త్రాదారణతో ఆకట్టుకున్న మహిళలు
సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగోళ్లకు ఆ సంబరాలే వేరు. వారం రోజుల ముందు నుంచి గాలిపటంలు ఎగుర వేస్తూ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు. ఆ పండుగకు ముందు నుంచే వెరైటీ పిండి పంటలు తయారు చేస్తారు. ఇదంతా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది.
విదేశాలలో జాబ్ చేయడానికో వెళ్లిన వారు సైతం సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకుంటూ పండుగ విశిష్టతను గుర్తు చేసుకుంటారు. ఇగో.. మలేషియాలో మన తెలుగోళ్లు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఘనంగా నిర్వహించుకున్నారు.
మలేషియా కౌలాలంపూర్ లో తానియా గ్రాండ్ రూఫ్ టాప్ హాల్, TLK కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్, కౌలాలంపూర్ లో మలేషియా ఆంధ్ర అసోసియేషన్ (MAA) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో పెద్ద ఎత్తున తెలుగు వారితో పాటు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.
ఈ సంక్రాంతి సంబరాలలో ఇండియన్ హై కమిషనర్ కౌన్సిలర్ అమ్రితా దాస్, మలేషియా తెలుగు ఫౌండేషన్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు, మలేషియా తెలంగాణ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, తెలుగు ఎక్స్ పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఆనంద్, ఇతర సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు.
చిన్నారుల డ్యాన్స్ లు..
సంక్రాంతి పండుగకు ముందు నుంచే పిల్లలకు డ్యాన్స్ లలో శిక్షణ ఇప్పించి వారితో ప్రదర్శనలు ఇప్పించింది మలేషియా ఆంధ్ర అసోసియేషన్.. ఆ పిల్లలు వేషాదారణ అందరిని అకట్టుకుంది. సంక్రాంతి పండుక ప్రత్యేకతను ఆ చిన్నారులు తమ ప్రతిభ ద్వారా చాటి చెప్పారు.
చిన్నారులు ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబురా, నుదుటన మూడు నామాలు, తలపై అక్షయ పాత్ర పెట్టుకుని హరిదాసు మరియు అమ్మవారి తదితర వేషాలు వేసుకొని చిన్నారులు వచ్చారు.
చిన్నారులు ముద్దు గులుపే విధంగా వేషాలు వేసుకోవడంతో అక్కడికి వచ్చిన ప్రవాసులు సంతోషం వ్యక్తం చేశారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకమైన సంక్రాంతి సందడి మలేషియా లో కనిపించింది.
కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల పాటలు హరిదాసు కీర్తనలు నృత్యాలతో ఆడిటోరియం కళకళలాడింది అలాగే ముగ్గుల పోటీల విజేతలు మరియు వివిధ వేషధారణలో వచ్చిన పిల్లలకు బహుమతులు అందజేశారు.
పిల్లలు చేసిన కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రుచికరమైన మన తెలుగు వంటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి . అలాగే ముగ్గుల పోటీలు, లక్కీ కపుల్, క్యూట్ బేబీ కాంటెస్ట్ , లక్కీ డ్రా నిర్వహించి టీవీ, బంగారు బహుమతులు అందజేశారు.
పిల్లలకు సంప్రదాయాలు నేర్పించాలి..
ఇండియన్ హై కమిషనర్ కౌన్సిలర్ మేడం అమ్రితా దాస్ మాట్లాడుతూ పిల్లలకు సంప్రదాయాల పట్ల అవగాహన కలిగించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అలాగే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నిర్వహిస్తున్న మలేషియా ఆంధ్ర అసోసియేషన్ వారిని ఆమె అభినందించారు. ఈ సంక్రాంతి తెచ్చే సంబరాలు ప్రతి ఇంట ఆనందం వెల్లి విరియాలని ఆమె ఆకాంక్షించారు.
ప్రెసిడెంట్ శ్రీరామ్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. అలాగే ఈ సంవత్సరం అందరు సుఖ సంతోషాలతో గడపాలని ముక్యంగా రైతుల ఇంట సిరులు పండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ శ్రీరామ్ కోర్ కమిటీ సభ్యులు వెంకట్,శ్రీనివాస్ చౌటుపల్లి, ,జగదీష్ శ్రీరామ్ ,కిరణ్ గుత్తుల ,రవి వంశి ,శారద ,దీప్తి ,హరీష్ నడపన ,కిషోర్ ,నాయుడు రావూరి ,రవి జాస్ ,సందీప్ తన్నీరు ,సతీష్ నంగేడా ,కల్పనా వీ ,కల్పనా ఎస్ , ప్రమీల , వెంకీ , రంగా నడపన ,మురళి కృష్ణ , కుమార్ జి తదితరులు పాల్గొన్నారు.
బూరెడ్డి మోహన్ రెడ్డి