బాంబు బెదిరింపు ఇచ్చి 12 గంటలు విమానం ఆపేసిన 13 ఏళ్ల బాలుడు.. కారణం వింటే షాక్ అవుతారు

నిర్దేశం, న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి కెనడా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు ఇచ్చి 12 గంటల పాటు విమానం నిలిపివేసిన కేసును పోలీసులు చేధించారు. ఈ బెదిరింపులు చేసింది యూపీలోని మీరట్ కు చెందిన 13 ఏళ్ల చిన్నారి. అంతే కాకుండా, అసలు ఇలా చేయాల్సి వచ్చిందో ఆ చిన్నారి చెప్పిన కారణం విని పోలీసులు షాకయ్యారు. తన ఈమెయిల్ ను పోలీసులు ట్రేస్ చేయగలరా లేదా తెలుసుకుందామని ఈ పని చేసినట్లు విచారణలో చిన్నారి వెల్లడించాడు. కేవలం సరదా కోసమే ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు ఆ చిన్నారి.

అసలేం జరిగింది?
జూన్ 4వ తేదీ రాత్రి 11:30 గంటలకు ఢిల్లీ-టొరంటో విమానంలో బాంబు ఉందని ఢిల్లీ పోలీసులకు ఈమెయిల్ అందింది. వెంటనే అన్ని ఏజెన్సీలు వెంటనే చర్యకు దిగాయి, విమానాన్ని 12 గంటలకు పైగా నిలిపివేశారు. విచారణలో బెదిరింపు చేసిన ఇమెయిల్ కేవలం గంట ముందు సృష్టించినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ మెయిల్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి పంపబడింది. పోలీసులు మీరట్ వెళ్లి విచారణ ప్రారంభించగా.. 13 ఏళ్ల అమాయకపు చిన్నారి ఈ మెయిల్ పంపినట్లు వెలుగులోకి వచ్చింది.

కుటుంబ సభ్యులకు కూడా తెలియదు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి తన ఫోన్‌లో నకిలీ ఐడీని సృష్టించాడు. ఆ తర్వాత తన తల్లి ఫోన్‌ నుంచి ఇంటర్నెట్‌ని ఉపయోగించి మెయిల్‌ పంపాడు. మెయిల్ పంపిన తర్వాత ఆ మెయిల్‌ను తొలగించాడు. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు కాల్ జరుగుతున్నట్లు టీవీలో చూశాడు. అది చూసి పిల్లవాడు బాగా భయపడిపోయాడు. భయంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. చిన్నారి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చిన్నారిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!