దేశవ్యాప్తంగా పెరుతుగుతున్నకరోనా కేసులు

దేశవ్యాప్తంగా చాపకింద నీరులా

పెరుతుగుతున్నకరోనా కేసులు

న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 22 : దేశవ్యాప్తంగా కరోనా కేసులు చాపకింద నీరులా పెరుతుగున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం నిన్న దేశవ్యాప్తంగా 12,193 కొత్త కేసులు, 42 మంది కోవిడ్ బారిన పడి మృతిచెందారు. 10,765 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 67,556 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

రోజువారీ కరోనా కేసులు పెరుగుతుండటంలో ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన వారంలో కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. అంతకుముందు వారం 4.7గా ఉన్న పాజిటివిటీ రేటు గతవారం 5.5శాతానికి పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కోవిడ్ సోకిన వారు ఆస్పత్రిలో చేరడం, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో అధికసంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నందున కమ్యూనిటీ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది.కాబట్టి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అవసరమైన ప్రజారోగ్య చర్యలు చేపట్టడం అవసర మని కేంద్రం భావించింది. ప్రారంభ దశలోనే ఇటువంటి ప్రమాదాలను గుర్తించి, నియంత్రించినట్లయితే కరోనాను కట్టడి చేయొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

మహమ్మారి నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అనుసరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ భూషణ్ రాష్ట్రాలకు సూచించారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ అంశాలపై కీలక దృష్టితో సత్వర సమర్థవంతమైన ప్రజారోగ్య చర్యలను ప్రారంభించడం చాలా కీలకమని తెలిపారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!