Take a fresh look at your lifestyle.

సనత్ నగర్  బాలుడి కిడ్నాప్, హత్య కేసులో పురోగతి

0 13

సనత్ నగర్  బాలుడి కిడ్నాప్, హత్య కేసులో పురోగతి

ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్, ఏప్రిల్ 22 : సనత్ నగర్ బాలుడి కిడ్నాప్, హత్య కేసులో పురోగతి లభించింది. బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. హిజ్రా ఇమ్రాన్‌తో పాటు ఆటో డ్రైవర్ రఫిక్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక కారణాలతోటే బాలుడిని కిడ్నాప్ చేసి కిరాతకంగా హిజ్రా చంపేసినట్టు పోలీసులు చెబుతున్నారు. బాలుడి తండ్రితో ఉన్న ఆర్థిక వివాదాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు.అసలేం జరిగిందంటే.. నిన్న సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటి వచ్చిన అబ్దుల్ వహీద్ అనే బాలుడు నమాజ్ చేసేందుకు వెళ్లాడు.

ఈ క్రమంలో పక్కనే ఉన్న ఇమ్రాన్ అనే హిజ్రా పిలవడంతో బాలుడు ఆమెతో కలిసి వెళ్లారు. వీరిద్దరు కలిసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే కాసేపటికే బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి వెతికినప్పటికీ బాలుడి ఆచూకి లభించలేదు. ఇదిలా ఉండగా రాత్రి సమయంలో ఓ చోట క్షుద్రపూజలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడకు వెళ్లి చూడగా పూజలు జరిగినట్లు గుర్తించారు. నిన్న చాలా అరుదైన అమవాస్య కావడంతోనే ఈ పూజలు జరిగినట్లు గుర్తించారు.

అనుమానంతో బాలుడి కోసం తీవ్రంగా గాలించగా… పక్కనే ఉన్న నాలాలో బాలుడి మృతదేహం లభించింది. అయితే అప్పటికే హిజ్రా ఇమ్రాన్ పరారీలో ఉండటంతో ఆమె ఇంటిపై స్థానికులు దాడి చేసి ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనతో అల్లాదున్ కోటి ఏరియా ప్రాంతంలో రాత్రంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెల్లవారితే రంజాన్ పండుగ జరుపుకోనున్న సమయంలో బాలుడు ఈ విధంగా చనిపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఒక్కరేనా ఇంకెవరైనా సహాయం చేశారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే రంజాన్ పండుగ వేళ ఈ విషాదం చోటు చేసుకోవడంతో బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking