నిర్దేశం, హైదరాబాద్: బిజినెస్ చేయడం అంటే నమ్మకం, నాణ్యత ఎంత ముఖ్యమో అట్రాక్షన్, క్యాంపెయిన్ కూడా అంతే ముఖ్యం. ఎంత మంచి ప్రోడక్ట్ తయారు చేసినా సరే.. ప్రచారం సరిగా చేయకపోతే మార్కెట్ అవ్వదు. చిత్ర విచిత్రంగా ప్రచారం చేయాలి. అప్పుడే ఎక్కువ మందికి వెళ్తుంది. ఎంత మందికి చేరితే అంత యాపారం అవుతుంది. ఉదాహరణకు.. బంగారం షాపులు ఎన్ని ఉన్నా లలితా జ్యూవెల్లర్స్ ప్రచారం అయినంతగా మరే బంగారం షాపు కాలేదు. వేరేవాళ్లు పెద్ద పెద్ద సెలెబ్రిటీలను పెట్టి చేసిన ప్రచారం లలిత జ్యూవెల్లరీ ప్రచారం అంతగా జనాల్లోకి పోలేదు. కారణం.. యాడులో కనిపించే వ్యక్తి వేషదారణ గుండులో ఉంటాడు, చెప్పే విషయాలు కూడా ఆసక్తికరంగా, హాస్యంగా ఉంటాయి.
ఇలాంటివి చాలానే చూస్తుంటాం. ఇక తాజాగా ఒక కంటెయినర్ సంస్థ కూడా వేరే లెవెల్ ప్రచారం ప్రారంభించింది. ఈరోజుల్లో టీ-షాపులు సహా అనేక చిన్న చిన్న వ్యాపారాలకు కంటెనైర్లకు వాడుతున్నారు. ఇవే కాదు, ఇండ్లు కూడా కంటైనర్లలో రూపొందిస్తున్నారు. తక్కువ ఖర్చుతో అవుతుంది. పైగా అవసరాన్ని బట్టి వేరే స్థలానికి మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇదే ఆ సంస్థకు బాగా కలిసి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా హల్ చల్ కనిపిస్తోంది. హైడ్రాకు సిమెంట్ గోడలు భయపడుతున్నాయి. దీన్ని అదునుగా తీసుకుని కంటెయినర్ ఉంటే హైడ్రా భయం ఉండదంటూ ప్రచారం ప్రారంభించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఉన్న సాయితేజ కంటైనర్స్ కి వచ్చిన ఆలోచన ఇది. ఒక యాడ్ పోస్టర్ రూపొందించి వారి ఇంస్టా అకౌంట్లో షేర్ చేశారు. అందులో హైడ్రా కూల్చుతున్న ఇంటితో పాటు పక్కనే కంటైనర్లతో ఏర్పాటు చేసిన ఒక వ్యాపార సముదాయం ఫొటోలను పెట్టారు. ‘హైడ్రా అంటే భయమా? మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి’ అంటూ ఆ పోస్టర్లో రాసుకొచ్చారు. ఇక వారి వివరాలు, కాంటాక్ట్ కూడా షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ పోస్టర్ హల్ చల్ చేస్తోంది.