Take a fresh look at your lifestyle.

కేసీఆర్ vs హరీష్.. మళ్లీ ముదురుతోన్న కోల్డ్ వార్?

కేసీఆర్ కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు మధ్య కోల్డ్ వార్ ఉందనే విషయం దాచి పెట్టేదేం కాదు. చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న ఇరు నేతలకు ఎదురైంది.

0 100

– ఓటమితో బయటికి వస్తున్న లుకలుకలు
– ఈసారి కేసీఆర్ వల్ల కూడా కాదేమో?

నిర్దేశం, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబీ నేతలు ఒక్కొక్కరుగా గెట్టుదాటుతున్నారు. అలా వెళ్తున్న క్రమంలో కేసీఆర్ అహంకారం, అవినీతిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు కూడా. రాజకీయ నాయకులన్నాక ఆమాత్రం ఉండడం ఈరోజుల్లో వేరీ కామన్ అనుకోండి. కాకపోతే, కేసీఆర్ కుటుంబంలో కూడా కోల్డ్ వార్ పెరుగుతోందని టాక్.

కేసీఆర్ కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు మధ్య కోల్డ్ వార్ ఉందనే విషయం దాచి పెట్టేదేం కాదు. చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న ఇరు నేతలకు ఎదురైంది. అయితే, వారు ‘అబ్బేం అదేం లేదు’ అని కవర్ చేసినప్పటికీ, వాస్తవమేంటో అందరికీ తెలుసు. అయితే ఇన్నాళ్లు అధికారంలో ఉండడం వల్ల అణిగిమణిగి ఉన్న ఈ వ్యవహారం ఓటమితో మళ్లీ రచ్చకెక్కుతోందని అంటున్నారు.

ముందు నుంచి కేసీఆర్ తో ఉంటూ పార్టీ నిర్మాణంలో కీలకంగా ఉన్న తనకు కాకుండా కొడుకు కేటీఆర్ కు పార్టీలో కేసీఆర్ తర్వాత ప్రాధాన్యత లభించడం పట్ల హరీష్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక కేసీఆర్ తర్వాత రాబోయే వారసత్వంలో హరీష్ ఎక్కడ అడ్డువస్తారననే ఆందోళనా కేటీఆర్ కూ ఉంటుందనుకోండి. ఈ కారణాలే ఈ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ కి కారణం అవుతోంది.

పార్టీ ఓటమి తర్వాత అసెంబ్లీలో విపక్ష నేత అవకాశం తమకు దక్కుతుందని కేటీఆర్, హరీష్ ఆశించారు. కానీ, ఇద్దరికీ సర్ ప్రైజ్ ఇచ్చి ఆ పదవి కేసీఆర్ తీసుకున్నారు. అయితే, కేసీఆర్ తర్వాత పార్టీ ఆధిపత్యంలో మాత్రం ఇరు నేతల ఘర్షణ మాత్రం సద్దుమనగడం లేదని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking