వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం
నిర్దేశం, చెన్నై :
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం చెన్నైలోనీ అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఈ వివాహ వేడుక జరిగింది. జూన్ 7న హల్ది కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక ప్రారంభమై, జూన్ 8 సంగీత్ కార్యక్రమం జరుపుకుని, జూన్ 10 న ఉదయం 9 to 10 గంటల మధ్యలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా వివాహమహోత్సవం జరిగింది. కాగా రిసెప్షన్ జూన్ 14 న చెన్నయ్ లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరగనుంది.