సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నగదు స్వాధీనం
సికింద్రాబాద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ నగదును జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించారు. సరైన పత్రాలు లేని 37లక్షల 50వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయ శాఖ అధికారులకు అప్పచెప్పినట్లు జీఆర్పీ ఇన్ స్పెక్టర్ బీ సాయి ఈశ్వర్ గౌడ్ తెలిపారు.