Take a fresh look at your lifestyle.

ఆ భార్య భర్తలు ఇద్దరూ డాక్టరేట్ లే..

- భర్త మాలిక్ స్పూర్తిగా భార్య డాక్టరేట్ - చదువు కోసం ముగ్గురు పిల్లలు స్కూల్ కు.. తల్లి కాలేజ్ కు..

0 1,024

భార్య భర్తలు ఇద్దరూ డాక్టరేట్ లే..
– భర్త మాలిక్ స్పూర్తిగా భార్య డాక్టరేట్
– చదువు కోసం ముగ్గురు పిల్లలు స్కూల్ కు.. తల్లి కాలేజ్ కు..

నిర్దేశం, హైదరాబాద్ :

ముస్లీం మహిళలకు అన్నీ అడ్డంకులే.. వాళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే షరతులే.. కానీ.. సయ్యిదా మర్యమ్ గజాలా మాత్రం తన భార్త మాలిక్ ను స్పూర్తిగా తీసుకుని డాక్టరేట్ సాధించింది. నిజమే.. చదువుకు వయసుతో పని లేదనే నిజాన్ని ఆమె నిరూపించింది.

అర్ధాంతరంగా ఆపేసిన డిగ్రీ చదువుతోనే మాలిక్ ను పెళ్లి చేసుకుంది సయ్యిదా మర్యమ్. అప్పటికే డాక్టరేట్ సాధించిన మాలిక్ జ్యోతిరావు ఆలోచనలపై యువతకు క్లాస్ లు ఇచ్చేవారు. సావిత్రి భాయి ఫూలేను స్పూర్తిగా తీసుకుని తన భార్య సయ్యిదా మర్యమ్ తో పోస్ట్ గ్రాడ్యువేషన్ పూర్తి చేయించాడు మాలిక్. అప్పటికే వారికి ఇద్దరు కుమారులు హమ్మాద్ మాలిక్, జవ్వాద్ మాలిక్, ఒక కూతురు నాయిలా కౌసర్.. ఆ ముగ్గురు పిల్లలు చదువు కోవడానికి స్కూల్ కు వెళుతుంటే తల్లి సయ్యిదా తన భార్య సయ్యిదా మర్యమ్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్ కాలేజ్ లో ఎంఏ అరబిక్ చదువుకోవడానికి వెళ్లేది.

అరబిక్ లో డాక్టరేట్..

ప్రతి మగాడి అభివృద్ది వెనుక భార్య ఉందనేది సామెత.. కానీ.. సయ్యిదా తన భార్య సయ్యిదా మర్యమ్ గజాలా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అరబిక్ బాషలో డాక్టర్ ఆఫ్ ఫిలాసపీ చేయడానికి తన భర్త ప్రొఫెసర్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ మాలిక్ ప్రొత్సహమే. మాలిక్ కూకట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

అయితే.. సయ్యదా మర్యమ్ గజాలా ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా అరబిక్ భాషలో Ph.D (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) పొందారు. లైబ్రరీస్ ఆఫ్ హైదరాబాద్’ అరబిక్ ఉస్మానియా యూనివర్శిటీ విభాగాధిపతి ప్రొఫెసర్ సయ్యదా తలత్ సుల్తానా మార్గదర్శకత్వంలో ఆమె పరిశోధనలు చేసి డాక్టరేట్ సాధించారు మర్యమ్.

అయితే.. ఆ ఇంట్లో భార్యభర్తలు ఇద్దరూ డాక్టరేట్ లు సాధిస్తే.. వాళ్ల కూతురు  ఎంబిబిఎస్ పూర్తి చేసి డాక్టర్ నాయిలా కౌసర్ అయ్యారు. ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురు డాక్టరులే కదూ..

Leave A Reply

Your email address will not be published.

Breaking