నిర్దేశం: యూఏఈకి వెళ్లే భారతీయ ప్రయాణికులకు పెద్ద వార్త వచ్చింది. అక్కడికి వెళ్లే ప్రయాణికుల కోసం కొత్త వీసా విధానం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త వీసా ఆన్ అరైవల్ విధానంలో అమెరికా, యూరోపియన్ యూనియన్‌లోని ఏదైనా దేశానికి చెందిన వీసా లేదా గ్రీన్ కార్డ్ కలిగి ఉన్న వ్యక్తులు యూఏఈ వీసా పొందడం సులభమైంది.
వాస్తవానికి కొత్త విధానం ప్రకారం.. అర్హత కలిగిన భారతీయ పౌరులు యూఏఈకి చేరుకున్న తర్వాత 14 రోజుల వీసాను అందించాలని యూఏఈ ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. ఇది భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య భాగస్వామ్యాన్ని పెంచుతుందని, ఇరు దేశాల స్నేహాన్ని బలోపేతం చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం యూఏఈలో 35 లక్షల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు.