సంక్షేమమే పరమావధిగా పనిచేయాలి:
– అడిషనల్ డీజీపీ వి వి శ్రీనివాస రావు
నిర్దేశం, హైదరాబాద్ :
పోలీసులు సమయాన్నే దైవం గా, వృత్తిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా క్రమశిక్షణ ను అలవరుచుకోవాలని వివి శ్రీనివాసరావు అడిషనల్ డీజీపీ, డైరెక్టర్ ఆర్ బి వి ఆర్ ఆర్ పేర్కొన్నారు. మేడ్చల్ కండ్లకోయ పరిధిలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మంగళవారం శిక్షణ పూర్తి చేసుకున్న 142 కానిస్టేబుల్స్ కు దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శిక్షణ పూర్తిచేసుకున్న వారిని ఉద్దేశించి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇతర రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలకు దిక్సూచిగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం పోలీసుల కుటుంబాలకు విద్యా, ఇతర సంక్షేమ పథకాలను అమలుచేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్ స్వామి మాట్లాడుతూ తొమ్మిదినెలల కఠోర శ్రమ తరువాత మీరు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని , మీరందరూ మంచి నడవడిక , క్రమ శిక్షణ , నైతిక విలువలతో మీ భాద్యతలను నిర్వర్తించాలని తద్వారా రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు చేకూర్చాలని ఆయన తెలిపారు. అనంతరం కళాశాలలో నూతనంగా నిర్మించిన ఫౌంటైన్ లను , సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ , ఫోరెన్సిక్ ల్యాబ్ , సి సి టి వి లను ముఖ్య అతిథి ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో యూసుఫ్ గూడ బెటాలియన్ కమాండెంట్ పి. మురళీకృష్ణ గారు ,పోలీస్ ట్రైనింగ్ కాలేజీ డి ఎస్ పి లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.