కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో అందరి దృష్టి కాంగ్రెస్ వైపు మళ్లింది. ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు సులువుగా భావించిన పలువురు టికెట్ ఆశిస్తున్నారు.
డీఎస్పీ గంగాధర్ వర్సెస్ నరేందర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ టికెట్ ను ఆశించే వారిలో డీఎస్పీ గంగాధర్, విద్యా సంస్థల యాజమని నరేందర్ రెడ్డిల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. రాహుల్ గాంధీ బహుజనవాదాన్ని ఎత్తు కోవడంతో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బహుజన వర్గానికి అవకాశం ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తోంది. నోటిఫికేషన్ కు ముందు నుంచే స్వతంత్ర అభ్యర్థులూ దూకుడుగానే ప్రచారం నిర్వహించారు. అందులో ఒకరు.. భవిష్యత్ లో ఐపీఎస్ ర్యాంక్ పొందే అవకాశం ఉన్న ప్రస్తుత డీఎస్పీ మధనం గంగాధర్.. తన పదవికి రాజీనామా చేసి ప్రజా సేవ కోసం ఎన్నికల రంగంలోకి దిగారు. ఎలాగైన ఎమ్మెల్సీ గా గెలువాలని భావించిన గంగాధర్ గత మూడు నెలలుగా ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేసారు. నిజానికి నాయకుడు అన్ని చోట్లకు వెళ్లడు. ఆయన మనుషులో లేదంటే ఆయన పార్టీకి చెందిన నాయకులో ఓటర్ల దగ్గరకు వెళ్తుంటారు. కానీ, గంగాధర్ మాత్రం నియోజకవర్గం మొత్తం ఇప్పటికే స్వయంగా పర్యటించారు. నిజానికి ఈ నియోజకవర్గంలో 13 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు అన్ని ప్రాంతాలకు గంగాధర్ స్వయంగా తిరిగారు. ప్రాంతాలో పాటు.. అనేక సంఘాలను ప్రభుత్వ ఉద్యోగులను నిరుద్యోగులను విద్యార్థులను కలుస్తున్నారు. మిగిలిన పార్టీలు, మిగిలిన అభ్యర్థుల కంటే ముందు వరుసలో ఆయన దూసుకుపోతున్నారు.
గంగాధర్ కు కలిసి వచ్చే ఆంశాలు..
డీఎస్పీ గంగాధర్ కు కలిసి వచ్చే ఆంశాలలో ఆయన సామాజిక వర్గం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరో ముగ్గురు రెడ్డిలు మంత్రి వర్గంలో ఉన్నారు. అలాగే నామినేటేడ్ పోస్ట్ లలో ఇప్పటికే రెడ్డిలదే పై చెయిగా ఉంది. అయితే… ఆల్పోర్స్ విద్యా సంస్థ యాజమాని నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే.. ఇప్పటికే రెడ్డిలకు ప్రధాన్యత ఇవ్వడం.. పైగా విద్యా సంస్థల ద్వారా ఫీజులు వసూల్ చేయడం ఇతరాత్ర ఏ ఆంశాలను పరిశీలించిన గంగాధర్ కు టికెట్ ఇవ్వడం బెటర్ అనే టాక్ కాంగ్రెస్ వర్గాలలో ఉంది. గంగాధర్ కు టికెట్ ఇవ్వడం వల్ల బడుగు, బలహీన వర్గాలతో పాటు న్యాయవాదులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, పోలీసులులతో పాటు అన్ని వర్గాల మద్దతుతో డీఎస్పీ గంగాధర్ ఎమ్మెల్సీగా గెలుపు సులువు అనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది.
రాజకీయంతో మరింత సేవ చేయాలని
అత్యంత గడ్డు పేదరికాన్ని అనుభవించిన గంగాధర్ కు సమాజంలో మామూలు ప్రజల కష్టాలు తెలుసు. అంతే కాదు, దాన్ని అధిగమించిన వ్యక్తిగా.. ప్రజల కష్టాలకు ఉపాయాలేంటో కూడా ఆయనకు తెలుసు. పోలీసు ఉద్యోగం చేస్తుండగానే ఎంతో మంది యువతకు తనకున్న శక్తి మేరకు ఉద్యోగాలు ఇప్పించేవారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి చేస్తున్నదానికి ఎక్కడో బౌండరీ అడ్డు వస్తుందని ఆయన భావించారు. రాజకీయం అయితే ఏ పరిధీ లేకుండా.. అంతకు 100 రెట్లు ఎక్కువ చేయొచ్చనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అంటారు. దీనితో పాటు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని చైతన్యం చేయడమే కాకుండా.. ఎన్నికల సంఘాన్ని పలుమార్లు కలిసి తేదీలు పొడగించేలా చేశారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన బాధ్యతను తెలియజేస్తోంది.