మేడ్చల్ లో ఇల్లీగల్ బిల్డింగ్ లో సీఎంఆర్ షాపింగ్ మాల్..
- లంచాలకు తలొంచిన అధికారులు..
- హైడ్రా జాంతేనై.. ట్రేడ్ లైసెన్స్ లేకున్నా డోంట్ కేర్..
- ఓసీ లేకుండానే షాపింగ్ మాల్..
- అవినీతి అధికారులపై సీఎం చర్యలు ఉంటాయా..?
ఔను.. మేడ్చల్ డివిజన్ కేంద్రంలో అధికారులు కళ్లు మూసుకున్నారు. ప్రభుత్వ నిబంధనాలు పక్కన పెట్టి లంచాలకు తలొంచిన అధికారులు మౌనవ్రతం పట్టారు. నిబంధనలకు విరుద్దంగా మేడ్చల్ లో సీఎంఆర్ షాపింగ్ ప్రారంభోత్సవం జరుగుతున్న పట్టించుకున్న నాథుడు లేడు. ఒక వైపు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా తో అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తూ హల్ చల్ చేస్తుంటే అమ్యామ్యలకు తలొంచిన అధికారులు మాత్రం సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాన్ని అడ్డు కోలేక పోతున్నారు.
అధికారులపై చర్యలుంటాయా..?
మేడ్చల్ లో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేస్తున్న భవనానికి నిబందనల ప్రకారం ఏలాంటి అనుమతులు లేవు. ముఖ్యంగా సీఎంఆర్ భవనం వివాదం ఇప్పటికే కోర్టులో కొనసాగుతుండగా అదే భవనంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరుపడం చర్చనీయంశంగా మారింది. షాపింగ్ మాల్ ప్రారంభించాలంటే ప్రాథమికంగా సదుపాయాలు ఉన్నట్లు అధికారులు దృవీకరిస్తూ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. మంచినీరు, డ్రైనేజ్ కనెక్షన్ లేదు. అయినా.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అట్టహసంగా చేయడానికి ఏర్పట్లు జరుగుతున్నాయి.
సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేస్తున్న భవనంకు ఫైర్ ఎన్ ఓసీ లేదు. ఫైనల్ గా భవనం నిర్మించిన తరువాత జారీ చేసే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా లేదు. అధికార పార్టీ అండతోనే చట్ట విరుద్దంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభోత్సవం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి మేడ్చల్ లో నిబంధనలకు విరుద్దంగా ప్రారంభిస్తున్న సీఎంఆర్ షాపింగ్ మాల్ కు సహకారించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
– యాటకర్ల మల్లేష్, 9394 22 5111