నిర్దేశం, హైదరాబాద్: దేశంలో కొద్ది రోజులుగా బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ కావాలంటూ ప్రచారం కనిపిస్తోంది. అయితే కంపెనీ నుంచి కాకుండా వినియోగదారులు ట్రెండ్ చేస్తుండడం విశేషం. అప్పుడెప్పుడో ప్రైవేటు కంపెనీల ముందు బొక్కబోర్లా పడి కనుచూపు మేరలో కూడా కనిపించని ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్.. తాజాగా అగ్ర టెలికాం కంపెనీలకు చెమటలు పట్టిస్తోంది.
ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్-ఐడియాలు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన అనంతరం, బీఎస్ఎన్ఎల్ తీసుకువచ్చిన చవకైన ప్లాన్‌లపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. నాలుగు కంపెనీలు వేర్వేరు వ్యాలిడిటీ, ఫీచర్లతో తమ కస్టమర్లకు రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తాయి. అదే తాజా మార్పుకు కారణం.
జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లు
జియో తాజా వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లో రెండు ప్లాన్‌లు ఉన్నాయి. ఇవి 336 రోజులు, 365 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. 336 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.1899. ఇది అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, అలాగే మొత్తం 24జీబీ డేటాను అందిస్తుంది. జియా రూ. 3599 ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది రోజుకు 2.5జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ ప్లాన్‌లు
ఎయిర్‌టెల్ తాజా వార్షిక రీఛార్జ్ ప్లాన్ కూడా 336, 365 రోజుల చెల్లుబాటుతో రెండు ప్లాన్‌లు ఉన్నాయి. రూ. 1999 తో రీచార్జ్ చేసుకుంటే 336 రోజుల పాటు 24 జీబీ డేటా ప్రయోజనం పొందుతారు. దీనితో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం అందుబాటులో ఉంది. రూ.3599 ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంది. ఇది రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని అందిస్తుంది.
వొడాఫోన్-ఐడియా రీఛార్జ్ ప్లాన్‌లు
336 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.1999. ఇందులో మొత్తం 24జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు అపరిమిత కాలింగ్, మొత్తం 300 SMSల సౌకర్యం అందుబాటులో ఉంది. వొడాఫోన్-ఐడియా రూ.3599 365 రోజుల చెల్లుబాటు ఉంటుంది. అయితే, డేటా సదుపాయం రోజువారీ 1.5 జీబీ. దీనితో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ ల సౌకర్యం ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్‌లు
ఇక బీఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే.. 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్ లో మొత్తం 600జీబీ డేటా వస్తుంది. ఇందులో రోజువారీ పరిమితి లేదు.ఇక రోజుకు 100 ఎస్ఎంఎస్ ల సౌకర్యం, ఏదైనా ఫోన్ నంబర్‌లో అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు.
మీరు వార్షిక రీఛార్జ్ రూపంలో మంచి ఎంపిక కోసం చూస్తున్నట్లయితే, బీఎస్ఎన్ఎల్ 13 నెలల ప్లాన్‌ను తీసుకోవచ్చు. రూ.2399 ప్లాన్ 395 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో, అధిక వేగంతో ప్రతిరోజూ 2జీబీ డేటా సౌకర్యం లభిస్తుంది. ఇది కాకుండా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ ల సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాలతో పాటు, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, జింగ్ మ్యూజిక్, గామన్ ఆస్ట్రోటెల్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్ వంటి సేవలు అదనంగా లభిస్తాయి.