నిర్దేశం: వేసవి కాలంలో కొన్ని పక్షులు మీ గాజు కిటికీని పదే పదే పొడవడం, తన్నడం లాంటివి గమనించే ఉంటారు. మరి పక్షులు ఇలా ఎందుకు చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పక్షి ఇలా చేయడం వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పక్షి ఇలా ఎందుకు చేస్తుంది?
ఇది తరచుగా వేసవి చివరిలో జరుగుతుంది. అది పక్షులకు సంతానోత్పత్తి సమయం. ఈ సమయంలో కొన్ని జాతుల పక్షులు తమ భాగస్వాములు, పిల్లల గురించి చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎక్కడి నుంచైనా తమ కుటుంబానికి ఏదైనా ముప్పు కనిపిస్తే భద్రత కోసం పోరాడేందుకు సిద్ధమవుతాయి. ఈ పక్షులు మీ ఇంటికి సమీపంలో గూడు కట్టుకుని పిల్లలకు జన్మనిచ్చినప్పుడు, ఆ పరిసరాల్లో తమలాంటి మరే ఇతర పక్షిని కనిపించినా సహించవు. ఒక రకంగా చెప్పాలంటే శత్రువులుగానే పరిగణిస్తాయి. ఇదే సందర్భంలో కిటికీలు లాంటి గాజు పరికరాల దగ్గరికి వెళ్లినప్పుడు అద్దంలో తమ ముఖాన్ని చూసి వేరే పక్షి అని భావించి గాజును పొడుస్తాయి.
మనం ఏమి చేయాలి?
ఇలాంటి మీ ఇంటి పరిసరాల్లో జరిగే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్లి పక్షి గాయపడిందో లేదో చూడండి. గాయపడితే మీ వద్ద ఉన్న సదుపాయాలతో సహాయం చేసి గూడుకు వద్దకు తీసుకెళ్లి వదిలేయండి. వేసవి కాబట్టి దాని కోసం నీరు, ఆహారం వంటి ఏర్పాట్లు చేయండి. వేసవిలో దాహం కారణంగా చాలా పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇక చివరగా.. పక్షులకు ఇబ్బంది కలగకుండా గాజు అద్దాలను మార్చండి.