డీఎస్సీలో పీఈటీ పోస్టులను తక్కువ చూపించారు
నిర్దేశం, హైదరాబాద్ :
ప్రభుత్వం మెగా డీఎస్సి లో పీఈటి పోస్టు లను తక్కువగా చూపెట్టడాన్ని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాగంటి రాజేష్ తప్పుబట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ న్యూస్ సెమినార్ హాల్లో స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయుల సమావేశం గురువారం నిర్వహించారు.
పీఈటి పోస్టులు 1600 ఉంటే కేవలం 182 పోస్టులు ఇవ్వడం చాలా బాధాకరం అన్నారు. నిరుద్యోగులను పట్టించుకోకపొడవం వల్లనే గత ప్రభుత్వం అధికారం కోల్పోయిందని గుర్తు చేశారు. వెంటనే డీఎస్సి నోటిఫికేషన్ ను సవరించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచిన విధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని కోరారు. డీఎస్సి నోటిఫికేషన్ లో పీఈటి పోస్టు లను వెంటనే పెంచకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.