అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్కు మళ్లీ చుక్కెదురైంది. సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది.
గతంలో సీబీఐ విచారణకు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగా.. దానిని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు సింగిల్ తీర్పును సమర్ధిస్తూ.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ‘సర్కార్ అభ్యర్ధన’ను కొట్టేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్లీ చుక్కెదురైనట్లయ్యింది. ఆర్డర్ పై సుప్రీం కోర్టు వెళ్లేందుకు కొంత సమయం కావాలని.. అప్పటి వరకు ఆర్డర్ సస్పెండ్ లో ఉంచాలని కోరారు అడ్వకేట్ జనరల్. అయితే.. ఆర్డర్ సస్పెన్షన్ కు నిరాకరించింది హైకోర్టు.
ఇక.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్ను.. సింగిల్ బెంచ్ తీర్పు. అమలు చేయాలనీ దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించింది హైకోర్టు డివిజన్ బెంచ్.
ఇదిలా ఉంటే.. మొయినాబాద్ లోని ఓ ఫామ్రాజ్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం జరిగినట్లు అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేసి.. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసింది. ఆపై సిట్ ద్వారా ఈ కేసు దర్యాప్తును కొనసాగించింది ప్రభుత్వం. అయితే.. కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా.. సీబీఐకి ఇవ్వొద్దంటూ తెలంగాణ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ సర్కార్ అభ్యర్ధనను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.