రాచకొండ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల గ్రామంలో నిన్న రాత్రి
ఓలా ఆటో లో తన బ్యాగును మర్చిపోయిన రవి అనే వ్యక్తి డయల్ 100 కి సమాచారాన్ని అందించాడు. అధికారుల ఆదేశాల మేరకు సమాచారాన్ని అందుకున్న కీసర పెట్రోలింగ్ సిబ్బంది డ్రైవర్ పట్లావత్ కృష్ణ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి చూడగా ఆటోలో బ్యాగు కనబడింది. ఆటోలో బ్యాగు ఉంది అనే విషయం డ్రైవర్ కృష్ణ కూడా గమనించలేదు. కీసర పెట్రోలింగ్ సిబ్బంది ఆ బ్యాగును పరిశీలించగా దాంట్లో ఒకటిన్నర తులాల బంగారం(కమ్మలు) కనబడింది. బ్యాగును మర్చిపోయిన ఆ వ్యక్తికి తన బంగారు నగలు ఉన్న బ్యాగును అతడికి అందజేసిన కీసర పెట్రోలింగ్ సిబ్బందిని అభినందిస్తున్న స్థానికులు..
నిజాయితీని కనబర్చిన ఆటో డ్రైవర్ కృష్ణ ని అభినందించిన కీసర పోలీసులు