వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి పర్యటన ను జయప్రదం చేయండి CPI.. CPM

భద్రాచలం… ఖమ్మం నల్లగొండ. వరంగల్ ఉమ్మడి జిల్లా ల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు బలపరిచిన MLC అభ్యర్థి జయ సారధి రెడ్డి డిసెంబర్ 3న భద్రాచల రానున్నారని పట్టణంలో వివిధ ప్రాంతాల్లో జరిగే ప్రచార కార్యక్రమంన్నీ జయప్రదం చేయాలని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మల్ల వెంకటేశ్వరరావు కోరారు
సోమవారం CPI కార్యాలయంలో CPI. CPM పట్టణ స్థాయి ఉమ్మడి సమావేశం గడ్డం స్వామి. ఆకోజు సునీల్ కుమార్ అధ్యక్షత న జరిగింది
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో వామపక్షాల అవసరం ఉందని అన్నారు. చట్ట సభల్లో వామపక్ష ప్రజా ప్రతినిధులు లేనందున ప్రభుత్వం పని విధానాలపై చర్చించే .ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది అన్నారు. చదువుకున్న మేధావులు. విద్యార్థులు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రజలందరూ వామపక్షాలను ఆదరించాలని కోరారు
ఈ సమావేశంలో CPM జిల్లా కమిటీ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి. మర్లపాటి రేణుక. సరియం కోటేశ్వరరావు. CPM. CPI నాయకులు వెంకట్ రెడ్డి. బండారు శరత్ బాబు.నాగరాజు. MVS నారాయణ. బత్తుల నర్సింహులు. విశ్వనాద్. శ్రీ రాములు. సీతారాములు. ఫిరోజ్. లక్ష్మణ్. విక్రమ్. మారెడ్ది గణేష్. కిష్ట శ్రీనివాస్. కుసుమ. గంగ. లీలావతి తదితరులు పాల్గొన్నారు..జోసఫ్ కుమార్ ప్రజానేత్ర రిపోర్టర్ భద్రచలం..

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!