మావోయిస్టు కొరియర్ మరియు మాజీ దళ సభ్యుడి (AC) అరెస్ట్-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు కొరియర్, మాజీ దళ సభ్యుడు పోడియం జయ రామ్ @ గురూజీ @ ఇడమయ్య, నివాసం: కొండివాయి గ్రామం చర్ల మండలం.
— 2006వ సంవత్సరం నుండి నేటి వరకు నిషేధిత మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యునిగా, ఏరియా కమిటీ మెంబర్గా (ACM), కొరియర్గా వివిధ హోదాల్లో పనిచేశాడు.
— ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రెటరీ హరి భూషణ్ @లక్మా, BK-EG డివిజన్ కార్యదర్శి ఆజాద్ లకు కొరియర్గా పని చేస్తున్నాడు.
— మొత్తం యాభై కేసుల్లో నిందితుడి.
— చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో మరికొన్ని నేరాల్లో నిందితుడు.
— ఇతని వద్ద నుండి పోలీసులు జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్ లు వంటి ప్రేలుడు పదార్థాలు స్వాధీనం.
భద్రాచలం ASP డాక్టర్ వినీత్ ఐపీఎస్ వెల్లడి.

తేదీ:09-12-2020 మధ్యాహ్నం 3 గంటలకు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ 20వ PLGA ఆవిర్భావ వారోత్సవాలలో భాగంగా మావోయిస్టు పార్టీ తెలంగాణ ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మీటింగ్ నిర్వహించి, భారీగా పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించాలని కుట్రపన్నినారన్న విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు, స్థానిక చర్ల పోలీసులు చింతగుప్ప బోధనెల్లి అడవి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించారు. అది గమనించిన పోలీసులు వారిని వెంబడించి, అందులో ఒకరిని పట్టుకుని విచారించగా అతని వివరాలు పోడియం జయరాం@గురూజీ @ఇడమయ్య, తండ్రి భీమయ్య, వయసు 30 సంవత్సరాలు, నివాసం కొండివాయి గ్రామం చర్ల మండలం అని పేర్కొనడం జరిగింది. అతనివద్ద లభించిన స్టీల్ టిఫిన్ బాక్స్ లో 10- జెలటిన్ స్టిక్స్, 2 -డిటోనేటర్ లు, 2 -ఎలక్ట్రికల్ వైర్ బండిల్స్, 2 -ఎలక్ట్రిక్ బ్యాటరీలు గమనించి పూర్తిస్థాయిలో విచారించగా అతను 2006వ సంవత్సరం నుండి నేటి వరకు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేసినట్లుగా తెలిపాడు. 2006లో మొదటగా అప్పటి మిలీషియా కమాండర్ అయిన రతన్ కి కొరియర్గా మూడు సంవత్సరాలు పనిచేసి, అనంతరం 2009 నుంచి 2012 వరకు సుఖుధేవ్ దళంలో మావోయిస్టు పార్టీ సభ్యునిగా, ఆ తర్వాత ప్రమోషన్ పొంది 2012 నుండి 2015 వరకు చర్ల వెంకటాపురం మావోయిస్టు పార్టీ ఏరియా సభ్యునిగా పనిచేశాడు. అనంతరం 2016 నుండి నేటి వరకు తెలంగాణ మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ సెక్రటరీ హరిభూషణ్ @లక్మ కి మరియు BK-EG సెక్రటరీ అయిన ఆజాద్ కి ప్రధాన కొరియర్ గా పని చేస్తున్నాడు. 2006వ సంవత్సరం నుండి నేటి వరకు సుమారు 15 సంవత్సరాలుగా నిషేధిత మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగుతూ తెలంగాణ రాష్ట్రంలో యాభైకి పైగా నేరాల్లో పాల్గొన్నాడు. వీటితో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో మరికొన్ని నేరాల్లో పాల్గొన్నాడు. వీటిలో అనేక కేసులు UAP (ఊపా) చట్టం కింద నమోదై ఉన్నాయి.ప్రస్తుతం నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ PLGA ఆవిర్భావం జరిగి 20 సంవత్సరాలు అయినందున డిసెంబర్ 2 నుండి వారోత్సవాలు జరపాలని నిర్ణయించి, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసక చర్యలు జరిపి తమ ఉనికిని చాటుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ స్టేట్ కమిటీ అగ్రనాయకత్వం మరియు ఏరియా కమిటీలు, మిలీషియా కమిటీలు కుట్రపన్ని, కుట్రలో భాగంగా నిందితుడు జయరాం మరికొంత మంది మిలేషియా సభ్యులతో కలిసి, కూంబింగ్ లో ఉన్న పోలీస్ పార్టీ లను టార్గెట్ చేసి, ప్రేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేసి, పోలీసులను హతమార్చాలనే లక్ష్యంతో ఒక టిఫిన్ బాక్స్ లో ప్రేలుడు పదార్థాలతో వస్తుండగా కూంబింగ్ లో వున్న చర్ల పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. మిగిలిన మిలీషియా సభ్యులు పారిపోయారు.పోలీసులు అరెస్టు చేసిన నిందితుని దగ్గరనుండి 10- జెలటిన్ స్టిక్స్, 2 -డిటోనేటర్ లు, 2 -ఎలక్ట్రికల్ వైర్ బండిల్స్, 2 -ఎలక్ట్రిక్ బ్యాటరీలు ఒక స్టిల్ టిఫిన్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందుతునిపై హత్యా ప్రయత్నం మరియు ప్రేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు కు పంపబడుతున్నాడు.మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలి: ASP డాక్టర్ వినీత్, IPS గ్రామీణ ప్రాంత యువతీ యువకులు అభివృద్ధిని కోరుకుంటున్నారని, నిషేధిత మావోయిస్టు పార్టీకి పని చేయడానికి ఆసక్తిగా లేరని, కానీ ప్రజల అభిప్రాయాలకి విరుద్ధంగా నిషేధిత మావోయిస్టు పార్టీ వ్యవహరిస్తూ స్థానిక ప్రజల చేత బలవంతంగా నిషేధిత మావోయిస్టు పార్టీలో పని చేయించుకుంటున్నారు అని ASP గారు తెలిపారు. ఎవరైనా మావోయిస్టు పార్టీ మిలిషియా సభ్యులు గానీ, మావోయిస్టు పార్టీ కమిటీ సభ్యులు గానీ, దళ సభ్యులు గానీ స్వచ్ఛందంగా లొంగిపోతే వారి పైన ఉన్నటువంటి కేసులన్నీ మాఫీ చేస్తామని, జనజీవన స్రవంతిలో కలిసి బ్రతకడానికి వారికి కావలసిన ఆర్థిక సహాయం, జీవనోపాధిని కల్పిస్తామని, పోలీసులు వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని ASP వినీత్, IPS గారు తెలిపారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్  కుమార్..

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!