మానవ సేవ – మొక్కలు నాటటం ఒక్కటే వనజీవి రామయ్య

మానవ సేవ మాధవ సేవ అన్నట్లే, మొక్కలు నాటటం కూడా మానవాళికి ఆక్సిజన్ ఇచ్చిన వారిమై మాధవ సేవ చేసినట్లేనని వనజీవి రామయ్య కొనియాడారు. భద్రాచలం శ్రీ అభయాంజనేయ స్వామి వారి పార్క్ నందు గ్రీన్ భద్రాద్రి వారి ఆద్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ వనజీవి రామయ్య గారు పాల్గొన్నారు.ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ ఎలాగో మొక్కలు నాటటం ద్వారా మానవాళికి ఆక్సిజన్ ఇచ్చిన వారమై మాధవ సేవ చేసివట్లేనని కొనియాడారు.అదే విధంగా ప్రభా శంకర్ హాస్పిటల్ ప్రాంగణంలో పది సంవత్సరాల పొగడ మొక్క ను హస్పిటల్ అధునీకరణ పనులకు అడ్డుగా వున్నందున , ఆ మొక్కకు ఎటువంటి హాని తలపెట్టకుండు వేరే దగ్గరకు షిఫ్ట్ చేయడాన్ని రామయ్యగారు పరిశీలించి అభినందించారు.
ఈ సందర్భంగా గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు భోణాల నాగ సూర్య నారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వనజీవి రామయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలని, రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యనికి మొక్కలు నాటటమే పరిష్కారం అని తెలియజేసారు.గ్రీన్ భద్రాద్రి గౌరవాధ్యక్షులు శంకర్ గారు మాట్లాడుతూ హస్పిటల్ నిర్మాణం సమయంలో ఎనిమిది సంవత్సరాల పొగడ మొక్కలు రెండు తెచ్చి వెసామని, అప్పుడు చాలా వ్యయ ప్రయాసలకోర్చి వాటిని బ్రతికించుకున్నామని , మరలా ఇప్పుడు హస్పిటల్ అధునీకరణ నిమిత్తం ఈమొక్క అడ్డుగా ఉన్నందున, తగు జాగ్రత్తలు తీసుకొని మొక్కను బయటకు షిఫ్ట్ చేయటం జరిగిందని , ఆ మొక్క ఇప్పుడు చక్కగా బ్రతికి ఎదుగుతుందని, మొక్కలు అడ్డు వస్తే వాటిని నరకకుండా ఇదే విధంగా షిఫ్ట్ చేయటం ద్వారా మొక్కలకు హాని జరగకుండా చేయవచ్చని, ఎవరికైన ఈ విధంగా మొక్కలు షిఫ్ట్ చేయలంటే గ్రీన్ భద్రాద్రి వారిని సంప్రదింస్తే మొక్కలు సురక్షితంగా షిఫ్ట్ చేయుటకు సహకరిస్తామని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి గౌరవాధ్యక్షులు పల్లింటి దేశప్ప, గోళ్ళ భూపతిరావు, కంభంపాటి సురేష్,గ్రీన్ భద్రాద్రి ఉపాధ్యాయులు కామిశెట్టి కృష్ణార్జున రావు, ఉమా శంకర్ నాయుడు, సంపత్,తిరుమల రావు, కడాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!