ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో మాటామంతీ
మంత్రి కన్నబాబు గారితో కలిసి ఆలూరు సాంబశివారెడ్డి గారు తిరుపతిలో ఎన్నికల ప్రచారం
మీ ఓటు.. రాష్ట్రాభివృద్ధికి సపోర్టు గా నిలుస్తుందని రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డిగారు పేర్కొన్నారు. తిరుపతిలో పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన బుధవారం నాడు వ్యవసాయ శాఖామంత్ర్రి కన్నబాబుగారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. మండుటెండలో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి ప్రయాణికులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. జగనన్న పథకాలను ప్రయాణికులకు వివరించారు. అలాగే వారి పేరు వివరాలు తెలుసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేవా? కనుక్కున్నారు. ఈ పథకాల లబ్ధి వల్ల వారికెటువంటి మేలు జరిగింది? వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు శ్రీ కన్నబాబు మాట్లాడుతూ అభివృద్ధి చూసి ఓటేయమని, ప్రతిపక్ష నేతలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ప్రగతి మార్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నట్టు తెలిపారు.
ఆలూరు సాంబశివారెడ్డి గారు ఎలక్షన్ పాంఫ్లెట్స్ ప్రయాణికులకు అందించి, అందులో సంక్షేమ పథకాలను ఒకొక్కటిగా వివరించి తెలిపారు. పేదల కోసం పనిచేసే జగనన్న వెంటే మనం ఉండి ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న డాక్టర్ శ్రీ గురుమూర్తిగారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.