మత్స్య రంగంలో మహిళలు రాణించాలి

మత్స్య రంగంలో మహిళలు రాణించాలి

 : రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ పిట్టల రవీందర్

యాదాద్రి, జూన్ 26 : మత్స్య రంగంలో మహిళలు రాణించి, స్వయం అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అన్నారు. సోమవారం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామ మహిళ మత్స్యకారులతో హైదరాబాదులోని మత్స్య భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిషరీస్ చైర్మన్ రవీందర్ మాట్లాడుతూ మహిళలు మత్స్య రంగంలో అభివృద్ధి సాధించాలని చేపల ద్వారా స్వయం అభివృద్ధి చెందాలన్నారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసుగల వారు సభ్యత నమోదు చేసుకోవాలన్నారు . సొసైటీలో చేరిన వారు మిగతావారు చేరేలా ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా మహిళా మత్స్యకారులకు కావలసిన సహకారాలు అందజేయడానికి కృషి చేస్తుందన్నారు. ఆరోగ్య పరిరక్షణలో చేపల ఆహారం చాలా కీలకమన్నారు. రాష్ట్రంలో మత్స్య సంపద ఘనంగా పెరిగిందన్నారు చేపలతో 18 రకాల రోగాలు దరిచేరమన్నారు.

రాష్ట్రంలోని మహిళా మత్స్య సహకార సంఘాల సభ్యత్వంలో నిరంతర శిక్షణ కొనసాగించడానికి కార్యచరణాత్మక ప్రణాళికను రూపొందించినట్లు వారు తెలిపారు. రాష్ట్రంలోని మత్స్యకారులు అందరికీ పరిచయం చేయడంతో పాటు ఆయా పద్ధతుల్లో నిరంతరం శిక్షణ కొనసాగించేందుకు సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న శిక్షణ కేంద్ర వసతి గృహాలను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మహిళా మత్స్యకారులకు కూడా ప్రోత్సహించేందుకు నూతనంగా అందుబాటులోకి రానున్న ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

చేపల ప్రాసెసింగ్ వాల్యూ ఆడిషన్ చేపల ఆహార పదార్థాలు తయారు చేయడంతో పాటు చేపల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా అవసరమైన కార్యచరణ ప్రణాళికను రూపొందించినట్లు వారు తెలిపారు. నూతనంగా గోకారం గ్రామ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన మహిళ మత్స్య సహకార సంఘం రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రాన్ని ఆయన కొత్తగా ఏర్పాటు అయిన కమిటీ నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు ఉప్పరి నారాయణ, మత్స్య సహకార సంఘం నాయకులు నూతి చలపతి, గోకారం మండల మత్స్య సహకార సంఘం చీఫ్ ప్రోప్రేటర్ నూకల స్వాతి, ప్రధాన కార్యదర్శి బుంగపట్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!