– మొత్తంగా రూ.4883 కోట్లు కేటాయించిన భారత్
– సరిహద్దుతో పాటు ఆఫ్రికా దేశాలకూ సాయం
– రూ.2400 కోట్లతో ఎక్కువ లబ్దిపొందిన భూటాన్
నిర్దేశం, న్యూఢిల్లీ: జూన్ 9 దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. పొరుగు దేశాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వంటి పొరుగు దేశాల నేతలు పాల్గొన్నారు కూడా. కాగా, ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన మొత్తం బడ్జెట్‌లో రూ. 4883 కోట్లను ఇతర దేశాలకు సహాయం కోసమని ప్రత్యేకంగా ఉంచింది. నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్‌లకు దేశాలకు ఇందులో ఎక్కువ అందుతుందని అంటున్నారు.
పొరుగు దేశాలకు భారత్ ఎంత సాయం చేసింది?
ఇతర దేశాలకు సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం ఈ ఏడాది దాదాపు రూ.4883 కోట్లు కేటాయించింది. భూటాన్‌కు గరిష్టంగా రూ.2068 కోట్లు ఇచ్చారు. గతేడాది ఈ మొత్తం రూ.2400 కోట్లు. నేపాల్‌కు రూ.700 కోట్లు ఇచ్చారు. ఇది గతేడాది రూ.550 కోట్ల కంటే ఎక్కువ. మాల్దీవులతో వివాదం తర్వాత ఈ ఏడాది దాని బడ్జెట్‌ను పెంచలేదు. ఈసారి రూ.400 కోట్లు ఇచ్చారు. గతేడాది రూ.770 కోట్లకు పెంచడంపై చర్చ జరిగింది. శ్రీలంకకు గత ఏడాది రూ.150 కోట్ల ఇవ్వగా, ఈసారి రూ.245 కోట్లు ఇచ్చారు. అఫ్గానిస్థాన్‌కు రూ.200 కోట్లు అందాయి. ఇరాన్‌లోని చబహార్ పోర్టుకు రూ.100 కోట్లు ఇచ్చారు గత మూడేళ్లుగా ఈ మొత్తం మారలేదు. ఆఫ్రికన్ దేశాలకు మొత్తం రూ.200 కోట్లు ఇచ్చారంటే.. అక్కడ కూడా భారత్ శ్రద్ద చూపుతున్నట్లు తెలుస్తోంది. సీషెల్స్‌కు గత ఏడాది రూ.10 కోట్లకు పైగా అంటే రూ.40 కోట్లు వచ్చాయి.
ఇలా ఎందుకు ఇస్తున్నారు?
అభివృద్ధి సహాయం లేదా అభివృద్ధి సహకారం అంటే పెద్ద దేశాల ప్రభుత్వాలు లేదా ఇతర పెద్ద సంస్థలు చిన్న దేశాలకు డబ్బు లేదా వస్తువులను అందిస్తాయి. తద్వారా ఆ దేశాలు పురోగమిస్తాయి. ఈ సహాయం కేవలం డబ్బు పరంగానే కాకుండా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం, రాజకీయాల వంటి రంగాలలో కూడా ఉంటుంది. ఈ రకమైన సహాయాన్ని విదేశీ సహాయం లేదా అధికారిక అభివృద్ధి సహాయం (ODA) అని అంటారు.
అభివృద్ధి సహాయం ఎలా ఇస్తారు?
అభివృద్ధి సహాయాన్ని రెండు విధాలుగా ఇవ్వవచ్చు. ఒక దేశం నేరుగా మరొక దేశానికి ఇవ్వవచ్చు, దీనిని ద్వైపాక్షికం అంటారు. లేదా ఒక దేశం ప్రపంచ బ్యాంక్ లేదా ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు (UNDP, UNICEF, UNAIDS లాంటివి) వంటి అంతర్జాతీయ సంస్థకు డబ్బు ఇవ్వొచ్చు. దీనిని బహుపాక్షికం అంటారు. ప్రస్తుతం, సహాయంలో 70% ద్వైపాక్షికంగా, 30% బహుపాక్షిక మార్గాల ద్వారా ఇస్తున్నారు.
పొరుగు దేశాలు భారతదేశానికి ఎందుకు ముఖ్యమైనవి?
భారత్ మొదటి నుంచి పొరుగు దేశాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. కారణం, మన చుట్టూ ఉన్న ప్రాంతాలు సామరస్యంగా ఉండాలి. అలా ఉంటే.. ఆసియాతో పాటు ప్రపంచంలో భారత్ తన ప్రాధాన్యతను పెంచుకుంటుంది. ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానం 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. అయితే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే భారతదేశం దాని చుట్టుపక్కల దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పడానికి ప్రయత్నిస్తోంది. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం ద్వారా భారతదేశం తన భూమిని కాపాడుకోవచ్చు, విడిపోవడానికి ప్రయత్నించే వ్యక్తులతో పోరాడవచ్చు. ఉదాహరణకు.. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి మయన్మార్ సహాయం అవసరం.
సముద్రంలో భద్రత కోసం, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి పొరుగు దేశాలతో సహకారం చాలా ముఖ్యం. సముద్రంలో అనేక రకాల ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఈ దేశాలతో కలిసి పని చేయడం ద్వారా సరిహద్దు వరకు సముద్రాన్ని కాపాడుకోవచ్చు, ఉగ్రవాదం వంటి సమస్యలతో పోరాడవచ్చు. ఇకపోతే, చమురు, గ్యాస్ లాంటి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలి.