నిర్దేశం, వాషింగ్టన్ః అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ విజయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ది పెద్ద ప్రాధాన్యత అనేకంటే.. మస్కే ట్రంప్ ను గెలిపించారనడం సబబు. తన సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఎలాన్ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. మెయిన్ స్ట్రీం మీడియాను కూడా ఫెయిల్ చేశాడు. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా నెటిజెన్లు మస్క్ మీద పొగడ్తలు కురిపిస్తున్నారు. మస్క్ లాంటి ఫ్రెండ్ ఉంటే ఎక్కడైనా విజయం సాధించొచ్చని అంటున్నారు.
ప్రచారంలో మస్క్
డొనాల్డ్ ట్రంప్ కంటే ఎక్కువ ప్రచారం మస్క్ చేశారు. అంతే కాదు, ట్రంప్ కు ఆర్థిక సాయం గట్టిగానే చేశాడట. అటు డబ్బుంది, ఇటు ఎక్స్ అనే సోషల్ మీడియా వేదికుంది. ఈ రెండింతో మస్క్ రెచ్చిపోయాడు. కమలా హారిస్ ను అమెరికన్ల ముందు నెగిటివ్ చేయడంతో పాటు, ట్రంప్ కు హైప్ ఇవ్వడంలో మస్క్ కృషి ఎనలేనిది. అక్రమ వసలదారులతో పాటు అమెరికాను మరోసారి గ్రేట్ నిలబెట్టాలన్న రెండు నినాదాలు ఈ ఎన్నికల్లో బాగా పని చేశాయి. వాటికి ప్రతి రోజు బూస్ట్, హార్లిక్స్ ఇచ్చి మరీ ప్రచారం చేశారు మస్క్.