Take a fresh look at your lifestyle.

ప్రసూతి మరణాలను తగ్గించాం : మంత్రి హరీష్ రావు

0 13

ప్రసూతి మరణాలను తగ్గించాం
: మంత్రి హరీష్ రావు

హైదరాబాద్,  జూన్ 24 : నిలోఫర్ ఆసుపత్రిలో మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు రాగానే రాష్ట్రానికి వచ్చే టూరిస్టు నాయకులు ప్రచారం కోసం పనికి రాని మాటలు మాట్లాడుతరు. అభివృద్ధిలో, ఆరోగ్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణకు నీతులు చెబుతారు.

నీతి అయో ర్యాంకింగ్స్ లో రాజస్థాన్ 16, చత్తీస్ గడ్ 10, హిమాచల్ ప్రదేశ్ 7, ఉత్తర్ ప్రదేశ్ చిట్ట చివరి స్థానం. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మాతాశిశు మరణాల్లో 60శాతం పది దేశాల నుంచే అవుతుండగా అందులో భారత్ అగ్రస్థానంలో ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి చెందిన యునిసెఫ్ ఇటీవల ప్రకటించింది. సిగ్గు చేటని అన్నారు. నైజీరియా, పాకిస్థాన్, కాంగో, ఇథియోపియా, బంగ్లాదేశ్ వంటి దేశాలతో భారత్ పోటీ పడుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరువు తీసింది. ఇన్నేళ్ల స్వతంత్రంలో తల్లిబిడ్డల ఆరోగ్యాలకు కూడా మన దేశంలో భరోసా ఇవ్వలేకపోతున్నాం.

ఇలాంటి అంశాల గురించి దేశ నాయకులు ఆలోచించాల్సింది పోయి రాజకీయాల గురించి మాట్లాడుతుండటం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఎంఆర్, ఐఎంఆర్ గణనీయంగా తగ్గించి దేశానికి తెలంగాణను రోల్ మోడల్ చేశారు. మరొకరికి జన్మనిచ్చే అమ్మకు, ఊపిరిపోసుకునే బిడ్డ ఆరోగ్యాలకు అనేక పథకాలు, కార్యక్రమాల ద్వారా సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. మానవ సంపదే మహోన్నత సంపద అనే భావనతో సీఎం కేసీఆర్ పని చేస్తే, ఓట్లు, సీట్లే పరమావధిగా విమర్శలు చేస్తుంటారు. ప్రజల ఆరోగ్యం గురించి మా ప్రభుత్వం తపిస్తే, అనారోగ్య రాజకీయాలకు ప్రతిపక్షాలు తపిస్తున్నాయి.

నడ్డాలు, పాండేలు, సుక్విందర్ సింగ్ సుక్కులు సహా, తెలంగాణకు వచ్చి నీతులు చెప్పే బిజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. మా నుండి నేర్చుకొని వెళ్ళండి. విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయం రంగం, ఐటీ రంగం, పరిశ్రమల రంగం, సాగు నీటి రంగం, తాగు నీటి రంగం..లలో తెలంగాణతో పోల్చుకుంటే మీ పరిస్థితి ఎక్కడుంది. తెలంగాణ అగ్రస్థానంలో ఉంటే, బిజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అధమ స్థానంలో ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమంలో మా రాష్ట్రంతో పోటీ పడితే సంతోషిస్తం. కానీ నీచ రాజకీయాలు, గోబెల్స్ ప్రచారం చేస్తుంటే, తిప్పి కొడుతామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking