Take a fresh look at your lifestyle.

డ్రైవర్ పై ట్రాఫిక్ ఎస్సై దుర్భాష.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసు అంటూ కేటీఆర్ పోస్ట్..

డ్రైవర్ పై ట్రాఫిక్ ఎస్సై దుర్భాష.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసు అంటూ కేటీఆర్ పోస్ట్.. సోషల్ మీడియాలో కేటీఆర్ పై నెటిజన్లు.. పోలీసు అధికారిని లం.. కొడుకా అని దూషణ.. ట్రాఫిక్ ఎస్సై పై చర్యలు తీసుకున్న డీజీపీ..

0 1,157

డ్రైవర్ పై ట్రాఫిక్ ఎస్సై దుర్భాష..

  • ఇదేనా ఫ్రెండ్లీ పోలీసు అంటూ కేటీఆర్ పోస్ట్..
  • సోషల్ మీడియాలో కేటీఆర్ పై నెటిజన్లు..
  • పోలీసు అధికారిని లం.. కొడుకా అని దూషణ..
  • ట్రాఫిక్ ఎస్సై పై చర్యలు తీసుకున్న డీజీపీ..

‘‘చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా.. పాలించేటోడు ఎట్లుంటడో.. కింద వ్యవస్థ కూడా అట్లనే ఉంటది. ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీడ్రైవర్ పైన చేయిచేసుకొని దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్. తప్పు చేస్తే జరిమానా విధించాలి లేదా కేసు ఫైల్ చేయాలి కానీ దూషించుడు ఏంది..? ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసేసి బూతుల పోలీసింగ్ తెచ్చుడేనా మీ మార్పు? ’’

కేటీఆర్ ట్విట్టర్ లో పరొక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని దెబ్బి పొడిచారు. ఆ పోస్ట్ ను డీజీపీ, తెలంగాణ సీఎంవోకు ట్యాగ్ చేశారు. ఇగో.. ఈ పోస్ట్ కు డీజీపీ జితేందర్ స్పందించి ఆ డ్రైవర్ తో దురుసుగా ప్రవర్తించిన ట్రాఫిక్ ఎస్సైపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

సోషల్ మీడియాలో కేటీఆర్ పై..

కేటీఆర్ స్టైలే వేరు. విమర్శలను కూడా హేళనగా ట్విట్టర్ లో పోస్ట్ చేయడంలో అతనికి అతనే చాటి. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో పోలీసు రాజ్యంగా మార్చిన కేటీఆర్ అధికారం దూరం కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ పోలీసు అధికారులపై మండి పడ్డ సందర్భాలను మరిచి పోయారెమో.. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెడుతున్న పోస్ట్ లు వైరల్ గా మారుతున్నాయి.

కేటీఆర్ టూర్ లో బూతులే..

 కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ జిల్లా టూర్ కు వెళితే ప్రతిపక్షల నాయకులను ముందస్తూ అరెస్టు చేసిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. పోలీసు అధికారిని లం…కొడుకా.. అంటూ జనం సమక్షంలో దూషించిన సంఘనటను మరిచి పోలేమంటున్నారు నెటిజన్లు.  ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే పోన్ ట్యాపింగ్ లాంటి కేసులు కేసీఆర్ ప్రభుత్వంలోనే జరిగాయనేది మరిచి పోలేని నిజమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

పదేళ్ల పాలనలో కేటీఆర్..

కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ ఆడింది ఆట పాడింది పాటగా వ్యవహరించారు. ఒక సందర్భంలో జిల్లా టూర్ లో ఉన్న కేటీఆర్ పోలీసు అధికారిని లం…కొడుకా.. అంటూ జనం సమక్షంలో దూషించారు. పోన్ ట్యాపింగ్ లాంటి కేసులు కేసీఆర్ ప్రభుత్వంలోనే జరిగాయనేది మరిచి పోలేని నిజం.

ట్రాఫిక్ ఎస్సై పై చర్యలు..

ఏది ఏమైనా కేటీఆర్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ కు డీజీపీ జితేందర్ వెంటనే స్పందించారు. ఆ ఎస్సైపై క్రమశిక్షణ తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశామని ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking