ఆ నలుగురు
అసెంబ్లీ ఎన్నకలలో ఓడారు..
లోక్ సభ ఎన్నికలలో గెలిచారు..
నిర్దేశం, హైదరాబాద్ :
ఔను.. ఆ నలుగురు బీజేపీలో ఫైర్ బాండ్లు.. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వాళ్లంతా పోటీ చేసి ఓడి నోళ్లు. మళ్లీ ఈ లోక్ సభ ఎన్నికలలో ఆ నలుగురు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలలలో పోటీ చేసి ఓడినా ఆ నలుగురు గెలుపొందారు. నమ్మడం లేదా అయితే. ఈ వార్త చదువాల్సిందే.
ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో హుజురాబాద్, గజ్వేల్ రెండు నియోజక వర్గాల నుంచి ఈటెల రాజేందర్ ముదిరాజ్ పోటీ చేశారు. బండి సంజయ్ కరీంనగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. దర్మపురి అరవింద్ కోరుట్ల నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. రఘునందన్ రావు దుబ్బాక్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఈ నలుగురికి బీజేపీలో ఫైర్ బ్రాండ్స్ గా పేరుంది. కానీ.. బ్యాడ్ లక్. వాళ్లంతా ఓడి పోయారు. ఆరు నెలల తరువాత లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఆ నలుగురు లోక్ సభకు పోటీ చేశారు. మోదీ బ్రాండ్ తో పాటు వ్యక్తిగత చరష్మతో ఆ నలుగురు పార్లమెంట్ సభ్యులుగా విజయం సాధించారు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతే.. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. కానీ.. అక్కడి ప్రజలు ఓడించారు. ఆరు నెలల తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నాడు ఓడిన కొడంగల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి.
రాజకీయం అంటే అంతే… మరీ.. ఎమ్మెల్యేలుగా ఓడినోళ్లు ఎంపీలుగా గెలుస్తారు. గెలిచినోళ్లు ఓడుతారు. రాజకీయ చదరంగంలో ఎప్పుడైనా ఏదైనా జరుగచ్చు.