– కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం అనంతరం మళ్లీ దుమారం
– ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ మార్పులో సిగ్నల్ లోపం
– కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ ఒట్టి నీటి మూటలే
నిర్దేశం, హైదరాబాద్: తమ వద్ద సరికొత్త టెక్నాలజీ ఉందని, ఒకే ట్రాక్‌పై రెండు రైళ్ల రాకపోకలను ఆపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర రైల్వే గొప్పలకు పోయింది కానీ, వాస్తవంలో అది వట్టి నీటి మూటేనని పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి సమీపంలో జరిగిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం చెప్తోంది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ అగర్తల నుంచి సీల్దాకు వెళ్తోంది. గూడ్స్ రైలు లోకోపైలట్ సిగ్నల్ జంప్ చేశాడు. అనంతరం ఆగిఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ ప్రమాదంతో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎలా వచ్చాయన్న ప్రశ్న మరోసారి తలెత్తింది.
ప్రమాదాలకు కారణం ఇదే
భారతదేశంలో అత్యధిక రైలు ప్రమాదాలు ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు రావడం వల్ల జరుగుతున్నాయి. సరిగ్గా చెప్పాలంటే, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ మార్పులో సిగ్నల్ లోపం లేదా కొంత భంగం ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. వాస్తవానికి రైల్వేలో ప్రతి రైలు దాని రూట్ ప్రకారం ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ సెట్ చేయబడింది. దాని సహాయంతో ప్రతి రైలు వేర్వేరు ట్రాక్‌లపై నడుస్తుంది.
ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
రైల్వే ట్రాక్‌లలో ఎలక్ట్రికల్ సర్క్యూట్‌లను అమర్చారు. రైలు ట్రాక్ సెక్షన్‌కు చేరుకున్నప్పుడు, ఈ సర్క్యూట్ ద్వారా రైలు ఆ మార్గం గురించి తెలుసుకుంటుంది. ఈ సమాచారం ఆధారంగా EIC నియంత్రణ సంకేతాలు రైల్వే ట్రాకింగ్ ను నియంత్రిస్తుంది. ఇక్కడ నుంచి సంబంధిత రైలు తదుపరి మార్గం గురించిన సమాచారం అంటే అది ఏ మార్గంలో వెళ్లాలి అనే సమాచారం ఇవ్వబడుతుంది.
ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎందుకు వస్తాయి?
రైల్వే ట్రాక్ పై ఎప్పటికప్పుడు ట్రాక్ మార్చుకునే వెసులుబాటు ఉంది. ఒక్కో రైలు ఒక్కో ట్రాక్‌లో వెళ్లేందుకు ఇలా జరుగుతుంది. ప్రస్తుతం కంట్రోల్ రూం ద్వారానే రైలు వెళ్లే మార్గాన్ని నిర్ణయిస్తారు. కానీ, కొన్నిసార్లు సాంకేతిక కారణాలు లేదా మానవ తప్పిదం కారణంగా ట్రాక్ మార్చబడదు. అలాగే రైలు నిర్ణీత మార్గంలో కాకుండా వేరే ట్రాక్‌లో వెళుతుంది. దీంతో ఆ ట్రాక్‌పై ఉన్న మరో రైలును ఢీకొడుతుంది.