కొండా సురేఖపై తగ్గేదే లే.. క్రిమినల్ కేసు పెట్టాలి..

కొండా సురేఖపై తగ్గేదే లే.. క్రిమినల్ కేసు పెట్టాలి..

  • కోర్టు వాంగ్ములంలో నాగార్జున

(వయ్యామ్మెస్ ఉదయశ్రీ)

సమాజంలో జరిగే అన్యాయాలపై సినీమాలలో హీరో ఫైట్ చేస్తుంటారు. ఆ సినీమాను థియేటర్ లో చూసే ప్రేక్షకులు చూసి చప్పట్లు కొడుతుంటారు. విలన్ కు తగిన బుద్ది చెప్పారని హీరోను మెచ్చుకుంటారు. అది సినిమా.. ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్ లో అదే జరుగుతుంది.

మాస్ లీడర్ గా పేరున్న మంత్రి కొండా సురేఖ నోరు జారీ అక్కినేని కుటుంబాన్ని నడి బజారులోకి తీసుకు వచ్చింది. సమంతను కేటీఆర్ వద్దకు పంపాలని హీరో అక్కినేని నాగార్జున ప్రయత్నించారు. కానీ..  సమంత అందుకు అంగీకరించక పోవడంతోనే విడాకులు ఇచ్చారని కొండా సురేఖ చేసిన ఆరోపణలు టాలీవుడ్ ను షేక్ చేసింది. సినిమా వాళ్లంతా ఒక్కటై కొండాపై విమర్శలతో దాడి చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానంకు అక్కినేని అమల ఫిర్యాదు చేసింది.

konda surekha is a dirty politician

కొండా సురేఖపై తగ్గేదే లే..

అక్కినేని నాగార్జునకు పరువు సంబంధించిన కేసు.. ఆయనకు డబ్బుల కొరత అసలే లేదు.. అయినా.. మహిళా మంత్రిగా ఉండి కొండా సురేఖ నోరు జారీ తప్పు చేసింది. ఆ తప్పును సరిదిద్దు కోవడానికి ‘‘సారీ’’ కూడా చెప్పింది. కానీ.. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న అక్కినేని కుటుంబీకులు కొండాకు తగిన బుద్ది చెప్పాలని కోర్టు మెట్లు ఎక్కారు. అందులో భాగంగానే మంగళవారం హీరో అక్కినేని నాగార్జున కోర్టులో తన వాంగ్ములం ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ వల్ల తమ కుటుంబం పరువు పోయినందున క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాగార్జున కోరారు.

‘‘కొండా’’పై సోషల్ మీడియాలో..

మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో నిలబెట్టిన కొండాను పార్టీ అధిష్ఠానం మంత్రి పదవి నుంచి తొలగిస్తారని ట్రోల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన సురేఖపై చర్యలు తీసుకుని ఆ నష్టాన్ని పూడుస్తుందని టాక్ వినిపిస్తోంది. కానీ.. కొండా సురేఖ కేసు కోర్టుకు వెళ్లడంతో అక్కినేని – కొండా ఎపిసోడ్ లో ఇంకేమి జరుగుతుందో ఎదురు చూడాల్సిందే..?

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!