పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి..
విశాఖపట్టణం : షీలానగర్ కిమ్స్ ఐకాన్ నుంచి ఎయిర్ పోర్ట్ కు గ్రీన్ చానల్ ద్వారా శుక్రవారం అవయవాలు తరిలించారు. ఈమేరకు విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిటీలో అన్ని పోలీస్ స్టేషన్స్ విభాగం ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు ఎంతో చాకచక్యంగా సమయానికి ఏర్పోర్ట్ చేరుకునేలా బందోబస్తు చేశారు.
ఐకాన్ ఆసుపత్రి నుంచి ఎయిర్ పోర్టుకు భారీగా పోలీస్ బందోబస్తు.ట్రాఫిక్ నీయంత్రణ
చేపట్టారు. ఈ గుండెను తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్ హాట్ సెంటర్ కి విశాఖపట్నం నుండి బయలుదేరింది.
జంజూరు సన్యాసమ్మ (48)భర్త ఆనందరావు బిహెచ్ ఇఎల్ ఉద్యోగి సంక్రాంతికి పండగకు వెళ్ళి వస్తుండగా ఎయిర్ పోర్టు సమీపంలో బైక్ పై నుండి జారిపడిన సన్యాసమ్మ బ్రైయిన్ డెడ్ అవ్వడంతో 16 నుంచి చికిత్స పొందుతుంది.
అయితే అవయవదానం చేసేందుకు కుటుంబం సభ్యులు అంగీకరించడంతో వైద్యులు అన్నిఏర్పాట్లు చేసి పోలీసు ల సహకారంతో
ఆమే అవయవాలను తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్ హాట్ సెంటర్ కి తరలించారు. మనిషి మాముందు లేకపోయినా అవయవదానంతో మరొకరికి పునఃజన్మనిస్తుందని బందువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.