Take a fresh look at your lifestyle.

‘ఆలూరు’ దంపతుల ఔదార్యం

0 46

AP 39TV 06 మే 2021:

ఆంధ్రరాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఆధ్వర్యంలో ‘స్పందించు- ఆక్సిజన్ అందించు‘ అనే పిలుపు మేరకు శ్రీ ఆలూరు సాంబశివారెడ్డి దంపతులు రూ.3లక్షల 35వేల రూపాయలు ఆర్డీటీ హెడ్ మంచు ఫెర్రర్ కి అందజేశారు. ఇందులో శింగనమల ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి  తన ఒక నెల జీతం అందజేయగా, అందులో ఎమ్మెల్యే మాతృమూర్తి జొన్నలగడ్డ నిర్మలాదేవి తన రెండు నెలల పెన్షను ఇవ్వగా, ఇంకా ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి  ఇంకా దాతలు అందించిన మొత్తం సొమ్ము రూ.3,35,000 ఆర్డీటీకి అందజేసి..తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆలూరు దంపతులు సాంబశివారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ ఈ క్లిష్ట సమయంలో ఆర్డీటీ సేవలు ప్రశంసనీయమని, ప్రజలకు ఆక్సిజన్ అందించేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు బయటకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మరొక్కసారి కోరారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking