ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలు

  • నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్‌ ఆమోదముద్ర
  • వైయస్సార్‌ ఆసరాకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

ఏఫ్రిల్‌ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా చెల్లించనున్న ప్రభుత్వం నాలుగేళ్లలో రూ. 27,169 కోట్లు అక్కచెల్లమ్మల చేతికివ్వనున్న ప్రభుత్వం 2020–21 సంవత్సరానికి రూ.6792.21 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం దాదాపు 90 లక్షల మంది లబ్ధిదారులు సెప్టెంబరు 5 న జగనన్న విద్యా కానుక ప్రారంభానికి కేబినెట్‌ ఆమోదం దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి మూడు జతల యూనిఫారమ్, నోటుబుక్స్, టెక్ట్స్‌బుక్స్, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్‌ బ్యాగ్‌ విద్యా కానుక కింద పంపిణీ విద్యా కానుక కోసం రూ.648.09 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం సెప్టెంబరు 1న వై.యస్‌.ఆర్‌. సంపూర్ణ పోషణ్‌ ప్లస్, సంపూర్ణ పోషణ్‌ ప్రారంభం 77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ ప్లస్, మిగిలిన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ అమలు గర్భవతులకు, బాలింతలకు, 6 నుంచి 36 నెలల వరకు, అలాగే 36 నుంచి 72 నెలల పిల్లలకు పౌష్టికాహారం ఈ కార్యక్రమాలకు ఏడాదికి రూ.1863 కోట్లు 30 లక్షల మందికి లబ్ధి గతంలో కేవలం రక్తహీనతతో ఉన్న గర్భవతులకు, బాలింతలకు మాత్రమే ఆహారం అందించగా… ఇప్పుడు అందరు బాలింతలకు, గర్భవతులకు వర్తింపు గత ప్రభుత్వ కాలంలో రూ.762 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. ఈ ప్రభుత్వ కాలంలో మూడు రెట్లు పెంచి దాదాపు రూ.1863 కోట్లు కేటాయించి అమలు చేస్తున్నారు. డిసెంబరు 1నుంచి లబ్దిదార్ల గడపవద్దకే తినగలిగే నాణ్యమైన బియ్యం అందించడానికి చర్యలు 9260 వాహనాలు కొనుగోలు కోసం రుణాలు తీసుకునేందుకు సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్యారంటీ సార్టెక్స్‌ చేసిన నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదార్ల ఇంటి వద్దకే చేర్చేందుకు ఈ వాహనాలు వినియోగం 60శాతం సబ్సిడీ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు ఈబీసీ యువకులకు స్వయం ఉపాధి కింద ఈ వాహనాలను అందిస్తారు.

వాహనాల కోసం లబ్ధిదార్లు 10 శాతం చెలిస్తే చాలు
30 శాతం బ్యాంకు రుణం కాగా 60 శాతం సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం
నిరుద్యోగులైన యువకులకు ఆరేళ్ల పాటు ఈ కాంట్రాక్టు ఇవ్వనున్న ప్రభుత్వం
ప్రతినెలా రూ.10 వేలు ఆదాయం వచ్చేలా ఉపాధి మార్గం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం
దీని కోసం రూ.550 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
సార్టెక్స్‌ చేయడం వల్ల గతంలో 25 శాతం ఉన్న నూకలు 15 శాతానికి తగ్గనుంది
రంగు మారిన బియ్యం 6 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గనుంది
ఇందుకు గాను ప్రతికిలోకు అదనంగా రూ.1.10 వ్యయం
30 పైసలు డిస్ట్రిబ్యూషన్‌ కోసం ఖర్చు
పర్యావరణ హితంగా ఉండే 10 కేజీలు, 15 కేజీలు రీయూజబుల్‌ బ్యాగులు లబ్దిదార్లకు ఇవ్వనున్న ప్రభుత్వం
మొత్తం సార్టెక్స్‌ చేయడానికి రూ.480 కోట్లు వ్యయం
డోర్‌ డెలివరీకి రూ.296 కోట్లు వ్యయం చేయనున్న ప్రభుత్వం
అదనంగా 776 కోట్లు ఖర్చు

వై.ఎస్‌.ఆర్‌.బీమా కింద సామాజిక భద్రతా పథకం
సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు
శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు
శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలు, 51–70 ఏళ్ల మధ్య వర్తింపు
బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే వర్తించనున్న వై.యస్‌.ఆర్‌. బీమా
రాష్ట్రంలో సుమారు 1కోటి 50 లక్షల బియ్యంకార్డు కుటుంబాలు ఎల్‌ ఐ సి, కేంద్ర ప్రభుత్వం గత పథకాన్ని ఉపసంహరించిన నేపధ్యంలో ఈ కొత్త పథకాన్ని సొంత ఖర్చుతో తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.583.5 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 26 టీచింగ్‌ పోస్టులు, 14 నాన్‌ టీచింగ్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం వై.ఎస్‌.ఆర్‌ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్‌ పోస్టులు, 8 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం విశాఖ జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో అదనంగా 2 యూనిట్లు 115 మెగావాట్లు చొప్పున 2 యూనిట్లు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం దాదాపు రూ.510 కోట్లు వ్యయంతో ఏర్పాటుకు ఆమోదం వై.ఎస్‌.ఆర్‌ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం పులివెందుల సబ్‌డివిజన్ నుంచి రాయచోటి శివారు గ్రామాలు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు రాయచోటి జనాభా పెరిగిన నేపధ్యంలో ఈ కొత్త సబ్‌డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం
రాయచోటిలో కొత్త ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకూ ఆమోదం, వై.యస్‌.ఆర్‌ జిల్లాకు కొత్తగా 76 హోంగార్డు పోస్టులు మంజూరుకు మంత్రిమండలి ఆమోదం.

నూతన పారిశ్రామిక విధానం 2020–23 కేబినెట్‌ ఆమోదం

రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
2000 ఎకరాల్ల ో ఏర్పాటు కానున్న బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో రూ.46,400 కోట్లు అమ్మకాలు జరుగుతాయని అంచనా దాదాపు రూ.6940 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా భారీగా ఉపాధి అవకాశాలు
ఏపీఐఐసీ కి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏపీబీడీఐసీ) ఏర్పాటు వై.ఎస్‌.ఆర్‌ జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించిన మంత్రిమండలి రూ.10వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని, 1 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని అంచనా క్లస్టర్ల మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.730 కోట్లు ఖర్చు
ఎలక్ట్రానిక్‌ రంగంలో కీలక పరిశ్రమలు ఆకట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు.

భావనపాడు పోర్టు కోసం రైట్స్‌ కంపెనీ డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం
ఫేజ్‌ –1 కే దాదాపు రూ. 3669.95 కోట్లు ఖర్చు
శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చనున్న పోర్టు
ఉత్తరాంధ్రలో మరో కీలక ప్రాజెక్టు
తొలి దశలో భాగంగా 2024–25 నాటికి 12.18 ఎంటీపీఏ కార్గోను హేండిలింగ్‌ చేయాలన్న లక్ష్యం
2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో హేండలింగ్‌ లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ ఆక్వాకల్చర్‌ సీడ్‌( క్వాలిటీ కంట్రోల్‌ ) యాక్టు– 2006 సవరణలపై ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం

రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తాజా పరిస్ధితులుపై మంత్రిమండలిలో చర్చ
ఈ యేడు 26 శాతం అధికంగా వర్షపాతం నమోదు
101 శాతానికి చేరిన సాగు విస్తీర్ణం

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!