తూర్పున ఉదయించిన సూరీడు ముద్ద మందారంలా కనిపిస్తున్నాడు. అతని నుంచి వస్తున్న సూర్య కిరణాలు పచ్చని గడ్డిపై పడి ధగ ధగ మెరుస్తున్నాయి. చెట్లపై పక్షులు చేస్తున్న గోలతో ఆ ప్రాంతమంతా ఎప్పుడు చూడని వాతవరణం కనిపిస్తోంది. ఆ సమయంలో దుమ్ము రేపుకుంటూ వస్తోంది కారు.