విజృంభిస్తున్న విషగాలులు.. కోవిడ్ టైంలో చేసిన హడావుడి ఏది?

– 100లో 7 మరణాలు ఈ విషగాలుల వల్లే
– దేశంలోని టాప్-10 నగరాల్లో పరిస్థితి ఆందోళనకరం
– ఓరకంటనైనా చూడని ప్రభుత్వాలు

నిర్దేశం, హైదరాబాద్: కోవిడ్ చీకటి రోజులను ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. అసలు ప్రజలు ఎప్పుడు జబ్బుపల్లేదు, కోవిడ్ వల్ల తప్పితే చరిత్రలో ఎవరూ చనిపోలేదన్నంతలా ప్రచారం జరిగింది. ఆ టైంలో ప్రభుత్వాలు కూడా ప్రజారోగ్యం పైన చూపిన ప్రేమ అంతా ఇంతా కాదు. ‘ఊపిరి పిల్చాలంటే మాస్కులు, కదలాలంటే సానిటైజర్లు’ అంటూ బకెట్ల మీద బకెట్ల సానుభూతిని ఒలకబోశారు.

ఇదే సమయంలో ఇందులో ఇంకో కోణం కూడా కనిపించింది. కోవిడ్ లాంటి ప్రమాదకరమైన అనేక ఇతర రోగాలు, కారణాల వల్ల ప్రజలు జబ్బు పడుతున్నారు, చనిపోతున్నారు. కానీ వాటిని ఓర కంట కూడా చూడలేదు. అంటే, చనిపోతే చనిపోండి కానీ కోవిడ్ వల్ల మాత్రం చనిపోకండన్నట్లుగా వ్యవహరించింది ప్రభుత్వం. నిజానికి కోవిడ్ కంటే ముందు నుంచి వాయు కాలుష్యం అనేది అత్యంత తీవ్ర సమస్యగా ఉంది. వాయుకాలుష్యం వల్లే ఎక్కువ మంది ప్రజలు చనిపోతున్నారు. అయినా ప్రభుత్వం దీన్ని అసలు లెక్కే చేయడం లేదు.

తాజాగా విడుదల చేసిన లాన్సెట్ నివేదిక ప్రకారం భారతదేశంలోని 10 పెద్ద నగరాల్లో ప్రతి 100 మంది మరణాల్లో 7గురు విషపూరిత గాలి వల్ల చనిపోతున్నారు. ప్రస్తుతం, భారతదేశంలో 10 వేల మంది ప్రాణాలను కాపాడటానికి ముఖ్యమైన చర్యలు తీసుకోవాలని ఆ నివేదిక పేర్కొంది. ఢిల్లీ సహా ఇతర పెద్ద నగరాల్లో వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారవచ్చు.

లాన్సెట్ నివేదిక ఏం చెబుతోంది?
ఈ నివేదిక ప్రకారం.. 36 లక్షల నివేదికలను వివరంగా అధ్యయనం చేశారు. ఇందులో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, ముంబై, సిమ్లా, వారణాసిలలో పీఎం స్థాయి 2.5 మైక్రోపార్టికల్స్ స్థాయిని అధ్యయనం చేసి కనున్నట్లు పేర్కొన్నారు. ఈ కణం క్యాన్సర్‌కు అతిపెద్ద అపరాధనే విషయం తెలిసిందే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. 2008-2019 మధ్య పీఎం స్థాయి 2.5 కారణంగా కనీసం 33 వేల మంది మరణించారు. ఈ నగరాల్లో మరణాల సంఖ్య 7 శాతం. భారతదేశంలో మైక్రోపార్టికల్స్ స్థాయి క్యూబిక్ మీటరుకు 60 మైక్రోగ్రాములుగా ఉందట. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు కంటే నాలుగు రెట్లు ఎక్కువ. నగరాల వారీగా విషపూరిత గాలి వల్ల సంభవించిన మరణాలు చూస్తే.. అహ్మదాబాద్‌లో 2,495, బెంగళూరులో 2,102, చెన్నైలో 2,870, ఢిల్లీలో 11,964, హైదరాబాద్‌లో 1,597, కోల్‌కతాలో 4,678, ముంబైలో 5,091, పూణేలో 1,367, సిమ్లాలో 59, వారణాసిలో 831 మంది ఉన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో వాయు కాలుష్యం గురించి ఆందోళన లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇందులో దక్షిణాసియా దేశాలు, ఆఫ్రికా దేశాలు ఎక్కువగా ఉన్నాయి. హార్వర్డ్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ప్రకారం.. పీఎం స్థాయిని 2.5కి తగ్గించడం ద్వారా ప్రజల ప్రాణాలను రక్షించవచ్చని పేర్కొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!