కష్టాలను అధిగమించాలంటే…?
- ఆధ్యాత్మికత వైపు సానియా మిర్జా..
- దైవ చింతనతో ఒంటరితనాన్ని జయించవచ్చు..
- ఇన్ స్టాగ్రామ్ లో సానియా పోస్ట్..
నిర్దేశం, హైదరాబాద్ :
సెలబ్రిటీల లైఫ్ ఎప్పుడూ వివాదామే.. సంసార దాంప్యత్యానికి వచ్చే సరికి మనస్పర్థాలు ఏర్పాడి విడాకులు తీసుకునే వారే ఎక్కువే. ఇగో.. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా లైఫ్ కూడా అందుకు మినహాయింపు కాదు. మిర్జా తరచూ వార్తల్లో నిలుస్తోంది. భర్త షోయాబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత సానియ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అందుకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వీడియోలే సాక్ష్యం.
దైవ చింతనతో ఒంటరితనాన్ని జయించవచ్చు..
ఒంటరితనాన్ని జయించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో సానియా మానసికంగా బలాన్ని పుంజుకోవడానికి దైవ చింతనపై దృష్టి నిలిపింది. ముస్లిం పవిత్ర స్థలమైన హజ్ యాత్రకు వెళ్లనుంది. ఈ మేరకు తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ యాత్ర తర్వాత తాను మానసికంగా పరివర్తన చెంది తిరిగి రావాలనుకుంటున్నట్లు పోస్టులో తెల్పింది.
భారత టెన్నిస్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ సానియా. సానియ తన కెరీర్‌లో ఆరు టైటిళ్లు గెల్చుకుంది. మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ట్రోఫీలతో చరిత్ర సృష్టించిన ఈ టెన్నిస్ దిగ్గజం పాక్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌తో ప్రేమలో పడి 2010లో అతడిని పెళ్లాడింది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగగా 2018లో ఇజాన్ (కుమారుడు) జన్మించాడు. ఇంతలో షోయబ్ మరో పాక్ యువతి ప్రేమలో పడి సానియాకు విడాకులు ప్రకటించాడు. దీంతో సానియా, షోయబ్‌లు తమ పన్నెండేళ్ల వివాహబంధానికి ముగింపు పలికారు. అనంతరం అదే ఏడాది షోయబ్ తన ప్రేయసిని పెళ్లాడాడు. సానియా ఒంటరితనంతో పడుతున్న బాధను అధిగమించడానికి దైవం వైపు ఆలోచన చేస్తున్నారు.