డిజిటల్ ప్రపంచంలో ప్రజలకు ముఖ్యమైన, నిజమైన, అవసరమైన సమాచారాన్ని చేరవేయడమే లక్ష్యంగా ఏర్పడిన వైడ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ను మాజీ డీసీపీ సుంకర సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
నిర్దేశం-వైడ్ టీవీ ఎడిటర్ యాటకర్ల మల్లేశంతో కలిసి గురువారం హైదరాబాద్ లోని కొంపల్లిలో వైడ్ టీవీ కార్యాలయంలో ఈ ప్రారంభ కార్యక్రమం జరిగింది. కాగా, ఈ సందర్భంగా మాజీ డీసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ మల్లేశం తనకు 30 ఏళ్లుగా తెలుసని, జర్నలిజంలో నిక్కచ్చిగా పని చేసిన వ్యక్తని, ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికే నిర్దేశం పత్రిక విలువలతో నడుతస్తుందని అన్నారు.
ఇప్పుడు రాబోయే యూట్యూబ్ ఛానల్ కూడా అంతటి విలువలతో నడుస్తుందని అన్నారు. మంచి మీడియాను ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకుంటే, ఉత్తమమైన వార్తలు పెరుగుతాయని సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో పాటు బాబు, కృష్ణ, నవీన్, కృష్ణవేణి, రమేష్, టోనీ పాల్గొన్నారు.