Take a fresh look at your lifestyle.

అగ్ని నక్షత్ర’ లోని ‘తెలుసా తెలుసా’ పాట రిలీజ్

0 487

అగ్ని నక్షత్ర’ లోని ‘తెలుసా తెలుసా…’

పాటను రిలీజ్ చేసిన సమంత

హైదరాబాద్ : మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా లోని ‘తెలుసా తెలుసా…’ పాటను ఉమెన్స్ డే సందర్బంగా హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.

ఈ పాటకు ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ పాటలో లక్ష్మీ ప్రసన్న తో పాటు ఆమె తనయ విద్యా నిర్వాణ మంచు కూడా కనువిందు చేయడం విశేషం. త్వరలో ఈ చిత్రం యొక్క విడుదల తేదిని ప్రకటించడం జరుగుతుంది.

ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు. మధు రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
తారాగణం : డా మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రసన్న

Leave A Reply

Your email address will not be published.

Breaking