ఎజెన్సీ ప్రాంతాల జాతుల కోసం సిఫారసు చేయండి

ఎజెన్సీ ప్రాంతాల జాతులకు ప్రత్యేక ప్రయోజనాలకై సిఫారసు చేయండి
:  సినీ హీరో సుమన్

హైదరాబాద్ జూన్ 23 : రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో నివాసముంటున్న బీసీ వర్గాల లోని సంచార, అర్థ సంచార, విముక్త కులాలు, జాతుల ప్రజలను ప్రత్యేకంగా గుర్తించి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు నిర్మాణాత్మకంగా, నిర్దిష్టంగా సూచనలను ప్రభుత్వానికి ఇవ్వాలని సినీ నటుడు సుమన్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర బీసీ కమిషన్ తో భేటీ అయి కోరింది.ఈ నేపథ్యంగా, ఈ ప్రతినిధి బృందం కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు, సి.హెచ్.ఉపేంద్ర, కె. కిశోర్ గౌడ్ లతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలను కమిషన్ దృష్టికి తెచ్చారు.

ఈ భేటీ శుక్రవారం నాడు నగరం లోని ఖైరతాబాద్ లో గల తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం ఛాంబర్స్ లో జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు బీసీ వర్గాలకు ఎంతగానో చేయూతను అందిస్తున్నాయని సుమన్ కితాబు ఇచ్చారు. కాగా ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న విముక్త, సంచార, అర్థ సంచార కులాలు, జాతుల ప్రజలకు చైతన్య రహితం కారణంగా వాటిని పూర్తి స్థాయిలో అందుకోలేక పోతున్నారని కమిషన్ కు వివరించారు.

ఇలాంటి జాతులు, కులాల ప్రజల వాస్తవ జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరారు. కొన్ని ప్రాంతాలలో వోటర్ కార్డు, ఆధార్ కార్డు లాంటి ప్రయోజనాలను కూడా స్థిర నివాసులుగా లేని కారణంగా పొందలేక పోతున్నారని కమిషన్ కు తెలిపారు. ప్రధానంగా రాష్ట్ర బీసీ జాబితాలోని A-గ్రూప్ లో గల సంచార, విముక్త కులాల నిమిత్తం ప్రత్యేక అధ్యయనం నిర్వహించి, వారి జీవితాలలో ప్రభుత్వం వెలుగులు నింపే దిశగా రాష్ట్ర బీసీ కమిషన్ సిఫారసులు ఉండాలని ఆయన కోరారు. ఈ భేటీ సుమారు ఒక గంట పాటు కొనసాగింది. సుదీర్ఘంగా వివిధ కులాల సమాచారాన్ని ఉటంకిస్తూ చర్చించడం జరిగింది. ఆయనతో పాటు వివిధ కుల సంఘాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!