సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్
జగిత్యాల, జూన్ 24 : సైబర్ మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అప్రమత్తతతోనే సైబర్ మోసాలకు చెక్ పెట్టవచ్చు అని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. జిల్లా పరిధిలో గడిచిన వారం రోజులో 23 ఫిర్యాదులు రావడం జరిగిందని ఈ పిర్యాదులో బాధితులు 9,96,827/- రూపాయలు కోల్పోవడం జరిగిందన్నారు.
ఈ ఫిర్యాదు లో వెంటనే స్పందించి టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100 లకు కాల్ చేసిన ఫిర్యాదులో 81,088/- రూపాయలు ఫ్రిజ్ చేయడం జరిగిందని కావున జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ నేరాలు జరుగు విదానం పట్ల అవగాహన ఉంటే చాలావరకు నేరాలను తగ్గించవచ్చు అని జిల్లా ఎస్పీ తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరాలు చేస్తున్నారు.
ఒక వ్యక్తికి ఏదైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని అతని నుండి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేయడం జరుగుతుంది , భయం ఏదైనా వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ కానీ, పాన్ కార్డు కానీ, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వారి నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరం చేస్తున్నారు కావున ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930, డయల్ 100 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను చాలా వరకు తిరిగి పొందేలా చేయవచ్చు అని తెలిపారు.