నిర్దేశం, న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పీజీ (NEET-PG) పరీక్ష తేదీని ప్రకటించింది. ఆగస్టు 11న పరీక్ష నిర్వహించించనున్నట్లు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహించబడుతుందని ఎన్డీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. కటాఫ్ తేదీ ఆగస్టు 15 గా నిర్ణయించారు. ప్రతి సంవత్సరం 2 నుంచి 3 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు.
వాస్తవానికి ఈ పరీక్ష జూన్ 23న జరగాల్సి ఉంది. అయితే దానికి ముందే పేపర్ లీక్ కావడంతో పరీక్ష వాయిదా పడింది. పరీక్షలో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు ప్రభుత్వ సైబర్ క్రైమ్ సంస్థతో సమావేశం నిర్వహించిన కొద్ది రోజులకు కొత్త తేదీని ప్రకటించారు. నీట్-పీజీ పరీక్ష ప్రక్రియను ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో చేరేందుకు MBBS డిగ్రీ హోల్డర్ల అర్హతను అంచనా వేయడానికి NEET-PG నిర్వహించబడుతుంది.