నిర్దేశం, వాషింగ్టన్: ఇరాన్‌పై దాడికి సిద్ధమైన ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా నుంచి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ పత్రాలు లీక్ అయ్యాయి. ఈ పత్రాల లీక్ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో ఇజ్రాయెల్ లోనే కాదు అమెరికాలో కూడా సంచలనం రేపింది. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ పత్రాలు, టెలిగ్రామ్ ద్వారా లీక్ అయ్యాయి. నిజానికి ఈ సమాచారాన్ని అమెరికా దాని “ఐదు ఐస్” మిత్రదేశాలు – ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ మాత్రమే చూడగలవు. కానీ, సోషల్ మీడియాలో ఇవి లాక్ కావడంపై అమెరికా-ఇజ్రాయెల్ మధ్య సంబంధాలపై ప్రభావం చూపనుంది.
అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ 150కి పైగా బాలిస్టిక్ క్షిపణి దాడులు జరిపినప్పటి నుంచి ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందనే ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ క్షిపణి దాడులు జరిగిన వెంటనే ఐడీఎఫ్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమావేశమయ్యారు. ఇరాన్ మీద సరైన సమయంలో సరైన రీతిలో ఇజ్రాయెల్ స్పందిస్తుంని, దాని కోసం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రూపొందించిన ప్లాన్ మొత్తం బయటికి లీక్ అయింది.
ఇరాన్‌పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ ప్రణాళికలకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని లీక్ చేయడంపై అమెరికా దర్యాప్తు చేస్తోంది. ఎఫ్బీఐ, పెంటగాన్, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తమ స్వంత దర్యాప్తును ప్రారంభించాయి. అయితే ఈ విషయంపై స్పందించేందుకు ఎఫ్‌బీఐ నిరాకరించింది. అమెరికా ప్రమేయంతోనే ఈ పత్రాలు బయటికి వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఇజ్రాయెల్ కు ఇది దారుణమైన ఎదురుదెబ్బ. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కన్నీళ్లు పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.