మన దేశంలో ఎక్కువ ఎన్‌కౌంటర్‌లు జరిగిన రాష్ట్రాలు ఏవో తెలుసా?

నిర్దేశం, న్యూఢిల్లీ: ఎన్‌కౌంటర్‌ అంటే ఇంగ్లీష్ మనుషులు ఎదురుపడటం అని ఉంటుంది కానీ, వాస్తవంలో బుల్లెట్లు ఎదురుపడటం. మన దేశంలో ఎన్‌కౌంటర్‌ అనే శబ్దం వినిపించినప్పుడల్లా పేలిన తుపాకీ, పోయిన ప్రాణాలే లెక్కలోకి వస్తాయి. ఇక మన దేశంలో తరుచూ ఎన్‌కౌంటర్‌లు జరుగుతూనే ఉంటాయి. గతంలో నక్సలైట్లపై ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం రౌడీషీటర్ల మీద ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రాంతాల్ని బట్టి కూడా ఈ తేడాలు ఉంటాయి. తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్‌ అంటే నక్సలైట్లపై జరుగుతాయి, అలాగే యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో రౌడీషీటర్లపై జరుగుతాయి, ఇక జమ్మూ కశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో ఉగ్రవాదుల మీద జరుగుతాయి. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లపై కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. అది పక్కన పెడితే.. మన దేశంలో ఎక్కువగా ఎన్‌కౌంటర్‌లు జరిగే రాష్ట్రం ఏదో తెలుసా? ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు మీకు చెప్తాం.

ఏ రాష్ట్రంలో ఎక్కువ ఎన్‌కౌంటర్‌లు జరుగుతాయి?
దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. గత 7 సంవత్సరాలలో యూపీలో సుమారు 13 వేల పోలీసు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లలో 207 మంది నేరస్థులు, 17 మంది పోలీసు సిబ్బంది మరణించారు.

ప్రతి 13 రోజులకు ఒక నేరస్థుడు చనిపోతున్నాడు
గత ఏడేళ్ల ఎన్‌కౌంటర్ డేటాను మనం సగటున లెక్కగడితే, యూపీలో ప్రతి 13 రోజులకు ఒక నేరస్థుడు ఎన్‌కౌంటర్‌లో హతమవుతున్నాడు. ఈ ఎన్‌కౌంటర్లలో చనిపోతున్న వారిలో ఎక్కువ మంది తలపై రూ.75 వేల నుంచి రూ.5 లక్షల వరకు రివార్డు ఉన్నవారే.

యూపీలో ఎక్కువ ఎన్‌కౌంటర్లు ఎక్కడ జరిగాయి?
ఉత్తరప్రదేశ్‌లో మీరట్ జోన్‌లో ఎక్కువ ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. 2017 నుంచి ఈ జోన్‌లో 3,723 ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లలో 66 మంది నేరస్థులు మరణించగా, 7,017 మంది నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో మొత్తంగా ఈ 7 ఏళ్లలో 27 వేల మందికి పైగా నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

టాప్ 5 ఎన్‌కౌంటర్ రాష్ట్రాలు
2012 నుంచి 2017 వరకు దేశంలో అత్యధిక సంఖ్యలో ఎన్‌కౌంటర్‌లు జరిగిన రాష్ట్రాలను పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్, అస్సాం, మణిపూర్, జార్ఖండ్, బీహార్‌లలో జరిగాయి. యూపీ, బీహార్‌లలో నేరస్థులను ఎదుర్కొనేందుకు పోలీసులు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతుండగా.. అస్సాం, మణిపూర్, జార్ఖండ్‌లలో ఎన్‌కౌంటర్ కేసులు ఎక్కువగా ఉగ్రవాదులు, మావోయిస్టులు, నక్సలైట్లకు సంబంధించినవి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!